పుట:Andhrula Charitramu Part-1.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చైత్యము బొంబాయి పుమహానగరములకు నడుమనున్నది. ఈ చైత్యము వెలుపలి నుండి చూచునపుడు శోభాయమానముగ గాన్పింపక పోయిననులోపలికి బోయి చూచునపుడు దేవేంద్ర భవనమును బోలియుండును.

కార్లీ చైత్యము.

కార్లీ పర్వతములోని చైత్యము యొక్క పొడవు ముఖద్వారము మొదలుకొని వెనుక ప్రక్కనుండెడు గోడవఱకు 126 అడుగులుండును. వెడల్పు 45 అడుగుల 7 అంగుళములుండును. ఈ చావడిలోని ప్రక్కభాగములు క్రైస్తవాలయములలోని ప్రక్కభాగములంత విశాలములుగలేవు. వానిలో నడిమిభాగము మాత్రము 25 అడుగుల 7 అంగుళములు వెడల్పుకలిగి యున్నది గాని త్రక్కినవన్నియు స్తంభములసాంద్రతను గలుపుకొని పదియడుగులు మాత్రమె గలిగియున్నవి. శిల్పకారులహస్తనైపుణ్యమును బుద్ధిచాతుర్యమును దెలుపునట్టి చెక్కడపుంబనులచే శోభించుచుండిన ముప్పదితొమ్మిది స్తంభములుగలవు. ఈ విహారమున కంతకు వెలుతురు కలుగుటకై పైన ననుకూలకోణముగల తావుననొక రంధ్రముంచబడినది.