పుట:Andhrula Charitramu Part-1.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాళింగులుండిన యెడల నచ్చోటనే యా శాసనములను వ్రాయించియుండును. ఈ యొక్క యంశమే కాళింగులచ్చట లేరని వేనోళ్ళ జాటగలదు. మఱియును క్రీ.పూ.రెండవ శతాబ్ద మధ్యముననుండిన ఖారవేలుడు వ్రాయించిన హాతిగంఫాగుహలోని శాసనమున నాంధ్రరాజగు శాతకర్ణిని పశ్చిమదేశమునందు బెట్టియుండుటగూడ నాంధ్రులు గాని, కాళింగులుగాని గంగానదీ ముఖద్వారప్రదేశమున నుండలేదని ధ్రువపఱచుచున్నది. ఆంధ్రదేశము కళింగదేశమునకు బశ్చిమమునను దక్షిణమునను వ్యాపించియుండుట చేత నాంధ్రరాజగు శాతకర్ణిని పశ్చిమదేశమునందు బెట్టినది యుచితముగానేయున్నది.

ఆంధ్రులు మాల్భూమి (Malbhunii in Midnapur District)నుండి వచ్చినవారనుటకు మాలల పేరు దృష్టాంతముగా జూపినది వింతగా గన్పట్టకమానదు. కర్నలు విల్ఫర్డు గారు కర్ణశబ్దమును గైకొని క్రీస్తు శకము పండ్రెడవ శతాబ్దమునందుండిన శ్రీకర్ణదేవుడు మొదలుగా గల కాలదుర్య రాజులకును అంతకుబూర్వము పండ్రెడు శతాబ్దముల క్రిందటనున్న యాంధ్ర శాతకర్ణులకును ముడివెట్టి వృధాయాసము పడినరీతిని వీరును మాల శబ్దమును మాల్భూమికి ముడిపెట్టుచుండిరి. మాలలు మాలవర్తులను వారిని వాయు మత్స్య పురాణములు మధ్య దేశమునందలి జాతులలో జేర్చియున్నవనియు, మార్కండేయ పురాణముయొక్క వ్రాతప్రతిలో మాలదాసులును, గవరవర్తులును తూర్పుజాతులలో నుదాహరింపబడినను అచ్చు ప్రతిలో మాత్రము మానదాసులనియు, మానవర్తికులనియు సవరింపబడియుండెననియు, విల్ఫర్డు గారు మాల మిడ్నపూరు(మిధునపురము)లోని మాల్భూమికి సంబంధించినట్లుగా జెప్పుచున్నారుగాని మాల్భూమి మేఘదూతలో సూచించిన ప్రకారము చటీష్ఘరులో నున్నదని నేను తలంచుచున్నాని ఎచ్.ఎచ్.విల్సనుగారు వ్రాయుచున్నారు. [1] తెలుగు పరయాల క

  1. Vish Pur vol ii, pp.156-166; See Prof H.H.Wilson's Essays Analitical sc vol.II, p.329, note on verse 99 of the Translation of Meghaduta.