పుట:Andhraveerulupar025903mbp.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కులోత్తుంగ చోడదేవుని మొదటిపేరు రాజేంద్రుడు. ఇతడు యువరాజుగానున్న కాలమున బెక్కు రాజ్యములు దండయాత్ర లొనరించి విజయము గడించెను. దండయాత్రయం దీయువరాజు మధ్యమాగాణముల వాయిరా నగరమును బలపరాక్రమములతో ముట్టడించి యూధములను లోగొని విజయము గడించెను. పలు మాఱు బస్తరు రాజ్యములోని చక్రకోట్యమును కూడ జయించి సింధువంశజాతుడును విక్రమశాలియునగు వర్షుని సామంతరాజునిగ నొనరించెను. చాళుక్యుల ----లతో సంబంధము విమలాదిత్యుడు. రాజరాజు, -------చోడుల కాలమువఱకు వరుసగా మూడుతరముల కలసి వచ్చెను. ఈమువ్వురిభార్యలును చోడులయింట ఆడ పడుచులె. మేనమామలను దల్లులనుబట్టియో చోడులను జయించిన కారణము కారణముననో యీ రాజేంద్రుని రాజేంద్రుడనియు గులోత్తుంగ చోడుడనియు వ్యవహరించిరి. గరికాలచోడుడు, రాజనారాయణుడు అను బిరుదములు గలవు. ఎంతరాజకుమారు డైనను మాత జనకస్థానము మహారాజ్య సంబంధము గలవైనను క ---- మాత్రమితడు తొలుతనె పాల్పడెను. రాజరాజనరేంద్రుడు మరణించినంతనే తండ్రిరాజ్యమగు రాజమహేంద్ర --- కీకులోత్తుంగచోడదేవుడు రాజుగావలసియుండ