పుట:Andhraveerulupar025903mbp.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యచ్యుతరాయల యనుజుడగు సదాశివరాయలను రాజును జేయ గృషి యొనరించెను.

ఈఫరిస్థితులను సలకము తిమ్మయ గమనించి యుపేక్షించిన దనకే యపాయము ప్రాప్తించునని యాదిల్‌షాహను రహస్యముగరప్పించి విద్యానగరరాజ్యము నాతని యధీనముగావించెను. రామరాజాదులు చేయునదిలేక సలకము తిమ్మయ్య యొద్దకుబోయి మేము నీకు లోబడి యిచ్చవచ్చినచొప్పున జరించెదము. నవాబు నెటులేని పంపుమని కోరిరి. వారిమాటలు నమ్మి సలకము తిమ్మయ్య నవాబున కమితధనము కొన్నిమణులపరాధముక్రింద నొసంగి పంపివేసెను. రామరాజాదులు నవాబుపోయిన వెంటనే తిరుగబడి తిమ్మయ్యను జంపయత్నించుచుండిరి. ఇకబ్రదుకుట యసాధ్యమని తిమ్మయ్యభాండాగారము కొల్లగొట్టి గుఱ్ఱముల తోకలు చెవులు గోయించి రత్నములన్నియు దిరుగళ్ళలో విసరించి చేతనైనంతవఱకు సామ్రాజ్యసంపదల బాడుజేసి తానాత్మహత్య గావించుకొనెను.

రామరాజు సదాశివరాయలను విద్యానగర సంస్థానమునకు నామమాత్రమున నధీశ్వరుని గావించి తానె సామ్రాజ్యమును బాలించుచుండెను. రామరాజు నరపతి వంశజుడు. బసవేశ్వరునిచే జంపబడిన బిజ్జలు డీవంశమునకు గూటస్థుడు. తరువాత నీవంశజులు చిరకాల మార్వీటిలోనుంటచే నార్వీటి వారసబడిరి. రామరాజు పూర్వము కృష్ణరాయల హస్తగతమై