పుట:Andhra bhasha charitramu part 1.pdf/851

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(16) ఉన్నదున్నట్టుగా చెప్పు. (17) ఉన్నవా డున్నట్టుగా లేచినాడు. (18) కమలాక్షు నర్చించు కరములు కరములు. (19) "దొంగ! దొంగ! - "ఏడి, ఏడీ!" - "అడుగో! అడుగో!" - "పోయె! పోయె!" (20) రామ రామా! ఎంతపని జరిగినది? (21) చిట్టి చిట్టి పలుకులు; నంగిరినంగిరి మాటలు; నూనూగు మీసాలు. (22) నల్ల నల్లనివాడు; తెల్ల తెల్లనిచీర. (23) తెల తెల వారుతున్నది; అతని మొగము వెలవెల పోయినది. (23) ఎఱ్ఱని ఎఱుపు; తెల్లని తెలుపు; నల్లని నలుపు; పచ్చని పసుపు. (24) వేడివేడి ఇడ్డెనలు, కారం కారం పచ్చడి, పుల్ల పుల్లని మజ్జిగ, తియ్య తియ్యని మామిడిపండ్లు. (25) చల్ల చల్లగా; మెల్ల మెల్లగా. (26) చటచట, గటగట, సరసర, (27) మహా మహా వాళ్లకే లేదు, నీకొచ్చింది (28) పెద్ద పెద్ద వాళ్లందరున్ను అనేమాటే యిది. (29) పెద్ద పేద్ద మాటలాడుతున్నాడు. (30) ఇంతింతై వటుడింతయై (31) అంతంత పనులు నావల్ల కావు; ఎంతెంత? ఇంతింత; (32) ఈ తెచ్చిన సామాను లెంతెంత అయినవి.? (33) వీళ్లకెన్నెన్ని ఇవ్వమన్నావు? (34) కొన్నికొన్ని సమయాలలో ఇట్లే జరుగుతుంది. (35) వీరివీరి కిన్నిన్ని (ఇంతింత) అని నిర్ణయించు. (36) పల్లెపల్లెకున్ను పోయి ప్రచారము చేసినాడు. (37) ఇంటి యింటెడు పనీ నేనే చేసుకోవాలి; ముంత ముంతెడు నీళ్లున్ను తాగేసినాడు. (38) గంపలు గంపలు ధాన్యం మోసుకొచ్చినారు; ఇంటింటీకి తిరిగినారు; వీసెలకు వీసెలు బంగారం కొన్నాడు; ఒంటి ఒంటెడు నగలున్ను దొంగలు దోచుకున్నారు; ముద్దముద్దకూ బిసమిల్లా. (39) పాము! పాము! పాము! - ఏది! ఏది! ఏది! - కఱ్ఱ! కఱ్ఱ! కఱ్ఱ! - కొట్టు! కొట్టు! కొట్టు! - పోయె! పోయె! పోయె! పోయె! పోయె!! (40) వాడు వచ్చినాడు; వస్తే నువ్వుచెప్పినమాట చెప్పినాను; చెప్తే విన్నాడుకాడు; వినకపోతే, కోప్పడ్డాను; కోప్పడినా లక్ష్యపెట్టినాడు కాడు. (41) పనులు పనులుగా; బుల బులాగ్గా - ఈ రీతిగా నెన్నో యర్థభేదములను చూపవచ్చును.

పైని వివరించిన రీతులగాక యామ్రేడితము మఱికొన్ని విధములను గలుగుచుండును.

(1) అత్యంతార్థమున: (అ) ఎఱ్ఱ ఎఱుపు, తెల్లతెలుపు, నల్ల నలుపు; ఈ యుదాహరణములలో రెండవపదము మొదటిదానికంటె కొంచెము భిన్నముగా నున్నను, నా రెండింటికిని గల సంబంధము స్పష్టముగానే కనబడు చున్నది.

(ఆ) కట్టకడ, ఎట్టఎదురు, చిమ్మచీకటి, తుట్టతుద, నట్టనడుము, పట్టపగలు, పిట్టపిడుగు, మిట్టమధ్యాహ్నము, మిట్టమిఱ్ఱు, మిట్టమీను, ముమ్మోటు, మొట్టమొదట, విచ్చలవిడి. ఈ యుదాహరణములలో మొదటిపదము తెను