పుట:Andhra bhasha charitramu part 1.pdf/839

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"అంబకై పూనివచ్చి బలాధికుండు జామదగ్న్యుండు సాధింప జాలకున్న వాని (భీష్మ)" - ఇట్టి సమాసములకు 'సమాసక'ము లని లాక్షణికులు పేరిడిరి.

"నిక్కలాదులు యథాప్రయోగంబుగ గ్రాహ్యంబులు" అని చెప్పి నిక్కల, కవ్వడి; పువ్విలుకాడు, అనుమూ డుదాహరణములను మాత్ర మిచ్చెను. వీనికి వ్యాకరణ శాస్త్రప్రకారము విగ్రహమును గల్పించుటకు సాధ్యముకాక కావలయు నాతడు వానినట్లే గ్రహింపవలెనని చెప్పివిడిచెను. ప్రౌఢవ్యాకరణకారుడును వీనికి విగ్రమును గల్పింప యత్నింపలేదు; కానీ, తన శబ్దరత్నాకరమున 'కవ + వడి = కవ్వడి' యనియు, 'నిక్కము + కల' = నిక్కలయనియు పదములు వేఱుచేయబడినవి. కొందఱు పెత్తనము, వేగురుజుక్క, చిత్తరుబొమ్మ, ఎగాదిగ, ఎగుదల, బళాబళి, హళాహళి, పోటాపోటి, ఎడవంక, వలవంత, అవతల, ఇవతల, బెబ్బులి మొదలగు సమాసములను పైవానికి జేర్చియున్నారు. వీనిలో గొన్నిటికి శాస్త్రమును గల్పింపవచ్చును. కాని కొన్నిటి వ్యుత్పత్తులు మఱుగుపడి యుండుటచే వాని విగ్రహవాక్యములను వివరింప వీలుపడకున్నది. ఇట్టి సమాసములు తెనుగున ననేకములు గలవు. ఇవి యన్నియు వైకృత సమాసములయి యుండవచ్చును; అనగా సంస్కృత సిద్ధ సమాసములకు వికృతులు కావచ్చును.

పూర్వపదము నర్థము మఱుగుపడినవి.

ఉజ్జవ (ఉజ్ఘిత?) కల్లు, ఒమ్మచ్చు, ఒఱగడ్డము (ఒఱగు + అడ్డము?, ఒఱ + గడ్డము?), ఒఱగొడ్డెము (ఒఱగు + ఒడ్డెము?, ఒఱ + గొడ్డెము?), ఓరచ్చులు (ఓరు + అచ్చు?), ఓల (?) గందము, కర (?) గోడ, కారగ్గి (కాడు + అగ్గి), 'కారు' 'కాడు' నకు రూపాంతరము కావచ్చును), కుం ? వెరుగు, గ (?) గ్గోలు, గొ (?) బ్బండు, చరి (?) కుండ ('చలి' కి 'చరి' రూపాంతరమా? చలిదియన్న ముంచు కుండయేమో), చి (?)త్తడి (చిత్త్ర = చిత్ర + తడి?), దుం (?) బొడి (దుమ్ము + పొడి?), పంచకర (?) పాటులు, పడ (?) సాల (శ. ర. పడము + సాల, పడము = అందలము క్రింద పఱచెడు రత్నకంబళము; ఈ యర్థమునకును 'పడసాల' లోని 'పడ' కును సంబంధము లేదు. 'పడ' 'పథ' శబ్దభవమేమో; ఇంటియందు నలుగురును నడచెడు తావునకు పడాసాలయందురు); పడి(?) వాగె (పడి = ప్రతి?), పర (?) గడుపు; పుదియ (?) బొట్టు; పొరి (?) చూపు (పొరి + పొలి?), పొల (?) యలుక ('పొల్ల + అలుక' అని శ. ర.), పొలు (?) నోరు (పొర్లు + నోరు, అని శ. ర.); మెఱమెచ్చు ('మెచ్చు + మెచ్చు' అని శ. ర; కన్నడము: మెఱచు = మెర్చు = మెచ్చు, మెఱ (చు) + మెచ్చు = మెఱమెచ్చు); మేలుబంతి (మేలు + బంతి;