పుట:Andhra bhasha charitramu part 1.pdf/821

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(37) ఈక్రింది సమాసములలో నుత్తర పదములందు వికారము గలిగినది: తొలకరి, వెల్లివిరి, ముక్కంటి, వేగంటి, ననబోడి.

(38) ఈ క్రింది సమాసములలోని పూర్వపదములకు తెనుగున వ్యస్త ప్రయోగము లేదు. అడసాల (కన్న. అడికె = వంట), అడిగండ్లు, అలవోక, ఉజ్జవకల్లు, ఎట్టపోగు, ఒమ్మచ్చు, ఒఱగడ్డము, ఒఱగొడ్డెము, ఓరచ్చులు, ఓలగందము, కరగోడ, కారగ్గి, కుంపెరుగు, కుడినీరు; గండ పెండ (-౦డా, -౦డె)రము, గగ్గోలు, గొబ్బండు, చందురకావి, చరికుండ, చిత్తడి, చెందుప్పు, చొక్కాకు, జాలవల్లిక, జోబిళ్లు, జొబ్బిళ్లు, డా(దా)కల్లు, తిరుకొలను (-చిన్నము, - నాళ్ల, - నీఱు, - వతి, - మన్ను, - మణి, - మల, - మాళిగ.), దుంబొడి, పంచకరపాటులు, పడసాల, పడివాగె, పరగడుపు, పాదట్టు, పొదొట్టు, వుదియబొట్టు, పులకండము, పులసరము, పొరిచూపు, పొలయలుక, పొలునోరు, ప్రెబ్బొత్తి, బడగొండ, బొమ్మంచు, మెఱమెచ్చు, మేలుబంతి (మేలు = మీది), వఱగొడ్డము, వల్లకాడు, వాలుమగడు, విసనకఱ్ఱ, వెరవేకి, సంగమడుగు, సయ్యొద్ద, సరకట్టు, సవదండవల, సురేకారము, సెలగోల, సేసకొప్పు.

(39) కొన్నియెడల ప్రథమావిభక్తి క వర్ణముమీద నుత్తరపదము చేరినను విభక్తి ప్రత్యయము లోపింపదు: సుబ్బారాయుడుషష్ఠి, కొలము సామి.

(40) వ్యవహారమున నివర్ణాంత పదముపై నజాది పదము చేరునప్పుడు సంధికలుగక ప్రకృతిభావమే నిలుచును; శని ఏకాదశి, దీపావళి(-ళీ) అమావాస్య; సింహాద్రిఅప్పన్న (సింహాద్రప్పన్న అనియు సంధిరూపము వ్యవహారమున గలదు).

(41) ఆ, ఈ, ఏ అను నిర్ధారణార్థక విశేషములకు త్రికమనిపేరు. త్రికముమీది యసమ్యుక్త హల్లునకు ద్విత్వము బహుళముగా నగును; ద్విరుక్తమగు హల్లు పరమగునపు డాచ్ఛికంబగు వర్ణమునకు హ్రస్వమగును: ఆ + కన్య = అక్కన్య; ఈ + కాలము = ఇక్కాలము; ఏ + లోకము = ఎల్లోకము. బహుళమనుటచేత నూష్మరేఫములకు ద్విత్వము కలుగదు: ఆరాముడు, ఈశనివారము, ఏషష్ఠి, ఆసుందరి, ఆహరి, ఇట్లే ఋకారాదిపదము చేరునప్పుడును ద్విత్వముకలుగదు: ఆఋషి, ఆఋతువు, ఋకారముతో గూడిన కొన్ని హల్లులకును ద్విత్వము ప్రయోగములందు కానరాదు: ఆ + బృందము = అబ్బృందము; ఆ + ధృతి = అద్ధృతి; ఆ + ఘృతము = ఆగ్ఘృతము - మొదలగు సంధులు కానరావు - కృతహ్రస్వమయిన త్రికముమీదిచోటు శబ్దమునందలి యోత్వమునకు హ్రస్వమగును; లేదా, ఓకారమున కత్తు ఆదేశమగును; ఆచోటు, అచ్చోటు, అచ్చొటు; ఈచోటు, ఇచ్చోటు, ఇచ్చొటు, ఇచ్చటు; ఏచోటు,