పుట:Andhra bhasha charitramu part 1.pdf/809

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లతాగృహమొకటి కాన్పించుచుండును; తిక్కన రచనయందు తెనుగు చంద్రికాపూరము లొళొక్క సంస్కృత స్ఫటికశిలపై బ్రతిఫలించి వింతకాంతుల నీనుచుండును.

పోతన భాగవతరచనయందు సంస్కృత వ్యామోహము కాన్పించుచుండునుగాని, దీర్ఘసంస్కృత సమాసము లరుదుగనే యున్నవి. అనుప్రాస రచనావేశ సందర్భమున పోతన దీర్ఘ సమాసరచనాలోలు డగుచుండును:

      "వాలినభక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేలికిన్ దయా
       శాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖ మాలికిన్
       బాలశశాంక మౌలికి గపాలికి మన్మథగర్వ పర్వతో
       న్మూలికి నారదాది మునిముఖ్య మనస్పరసీరుహాలికిన్." భాగ. I. 2.

భక్త్యావేశము గలిగినప్పుడును బోతన దీర్ఘసమాస రచనముచే దన యుత్కంఠను దీర్చికొనును.-

      "వరగోవింద కథా సుధారస మహావర్షోక్తి ధారా పరం
       పరలంగాక బుధేంద్రచంద్ర యితరోపాయాసురక్తిం బ్రవి
       స్తర దుర్దాంత దురంత దుస్సహ జను స్సంభావితానేక దు
       స్తర గంభీర కఠోర కల్మష కవద్దావానలం బాఱుసే."

వర్ణనభాగము వచ్చినప్పుడు, ముఖ్యముగా గద్యము నట్టియెడల వ్రాయునపుడు పోతనకు దీర్ఘసమాసములు ప్రియములై యుండును.-

"భుజగేంద్ర పాలితంబయిన భోగవతీ నగరంబు చందంబున స్వసమాన బల యదుభోజ దశార్హకుకు రాంధక వృష్ణి వీరపాలితంబును, సకలకాల సంపద్యమానాంకుర పల్లవ కోరిక కుట్మల కుసుమ ఫల మంజరీపుంజ భార వినమిత లతాపాదపరాజీ విరాజితోద్యాన మహా వనోపన నారామ లాలితంబును, వనాంతరాళ రసాలసాల శాఖాంకురఖాదన క్షుణ్ణ కషాయకంఠ కలకంఠ మిథున కోలాహల ఫలరసాస్వాద పరిపూర్ణ శారికా కీరకుల కలకల కల్హార పుష్ప మకరందపావ పరవశ భృంగ భృంగీ కదంబ ఝంకార సరోవర కనకకమల మృదుల కాంద ఖండ స్వీకార మత్త వరటాయత్త కలహంసనివహ క్రేంకార సహితంబును..." భాగ. I. 255.

పేళ్ల గుత్తడములు వ్రాయవలసివచ్చునప్పుడు పోతన కందపద్యములలో వాని నేకసమాసముగ ముగించును.

      "అతులతమాల మహీజ| ప్రతతి క్షణ జాతజలద పరిశంకాంగీ
       కృత తాండవఖేలన విల| సిత పింఛవిభాసి బాలశిఖి సేవ్యంబై;
       కారండవ జలకుక్కుట| పారస బక చక్రవాక షట్పద హంసాం
       భోరుహ కైరవ నవక|హ్లార విరాజిత సరోరుహాకరయుతమై;