పుట:Andhra bhasha charitramu part 1.pdf/750

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తో కలహము; ఆచారనిపుణుడు = ఆచారముచేత నేర్పరియైనవాడు; గుడమిశ్రము = బెల్లముతో కలిసినది; ఆచారశ్లక్ష్ణుడు = ఆచారముచేత నాజూకయినవాడు.

ఈ కార్యము 'అపర' శబ్దముతో గూడ గలుగును: మాసాపరుడు = మాసముచేత పైబడినవాడు:- మిశ్రశబ్దమునకు బూర్వమం దుపవర్ణము చేరియున్నను సమాసమ కలుగును: గుడసంమిశ్రము = బెల్లముతో చక్కగా గలిసినది.

(3) కర్తృకరణ వాచకములు తృతీయయందుండి కృదంతములతో బహుళముగా సమసించి తృతీయా తత్పురుష సమాసము లగును: ఉదా. అహిహతుడు = పాముచేత చంపబడినవాడు (ఇచట 'పాము' కర్త); నఖభిన్నము = నఖములచేత భిన్నము (ఇచట నఖములు కరణము); ఇట్లే హరిత్రాతుడు, పరిశుచ్ఛిన్నము, మొదలయినవి.

బహులమనుటచేత 'దాత్రేణ లూనవా,' 'పరశునా ఛిన్నవాన్‌' అనుచోట్ల సమాసము కలుగదు. బహులగ్రహణముచేతనే 'పాదహారకుడు,' 'గళచోషకుడు,' అను చోట్ల సమాసము కలుగవీలులేకున్నను కలిగినది. కృదంతముతో సమసించు ననుటచేత "కాషె: పచతితరామ్" అనుచోట 'పచతితరామ్‌' అనునది క్రియాపదము కావున సమాసము కలుగదు.

(4) కర్తృకరణ వాచకపదములు తృతీయయందుండి కృత్యప్రత్యయాంతపదములతో అతిస్తుతి, అతినిందార్థములందు సమసించి తృతీయా తత్పురుష సమాసము లగును: ఉదా. వాతచ్ఛేద్యము (తృణము) = గాలిచేగూడ ఛేదింపదగినది, అనగా అంత మృదువైనదని స్తుతిగాని, అంత అల్పమైనదని నిందార్థముగాని స్ఫురింపవచ్చును. అట్లే, 'కాకపేయ (నది)' = కాకి ఒడ్డునగూర్చుండి ముక్కుతో త్రాగదగినంత లోతు నీళ్లుగల నది యని స్తుత్యర్థముగాని, కాకి ముక్కు మాత్రము మునుగునంతటి లోతు గల నది యని నిందార్థముగాని స్ఫురించును.

(5) అన్నవాచకముతో వ్యంజన వాచకపదముచేరి తృతీయా తత్పురుష సమాస మగును: ఉదా. ధధ్యోదనము = పెరుగుతో నన్నము.

(6) భక్ష్యవాచకపదముతో రుచి కలిగించు వస్తువును తెలుపు పదముకలిసి తృతీయా తత్పురుష సమాసమగును: ఉదా. గుడధానములు = బెల్లముతో చేరిన యవలు,