పుట:Andhra bhasha charitramu part 1.pdf/713

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. అర్, ఆర్, ఎర్, ఏర్ అను పదములకు ఉత్తర హిందూస్థాన భాషలలో అర్థము 'సంబంధించిన', లేక 'కలిగియున్న' అని. బెంగాలీ: దాగర్ = పెద్ద; పెరిగిన; అస్సామీ: డాంగరీయ = ఎత్తయిన; ద్రావిడములోని ఆర్, ఏర్ అను పదములనుండి పైని సూచించిన అర్, ఆర్, ఎర్, ఏర్ పదములు వచ్చియుండవచ్చును గాని, ఈ గ్రామములున్నచోట కొన్నింటికైన దగ్గరదాపున ఎట్టి యేఱును లేకుండుటవలన, పై ద్రావిడోత్పత్తి వాదము దృడపడదు.

ఉదా:- పైడేటి, ఆకులేడు, చియ్యేడు, తేకులేడు, దోసలేడు, ములకలేడు, దొడ్డేరి, ఇప్పేరు, కూడేగు, చాదలేరు, పడమటియాలేరు, పూలేరు మొదలయినవి.

3. వాయి: సంస్కృతములోని వాపి (=బావి) పదమునుండియే వాయి వచ్చినది. వాయిగ్రామ, రోళ్లవాయిక అను పేర్లు గుప్తశకములో దామోదరపూరు దానశాసనములలోను, దేవఖడ్గుని ఆష్రాఫ్ పూరు దానశాసనములోను కనబడుచున్నవి. ఇవి బంగాళా దేశములోనివి. తెనుగు వాయి (నోరు) పదమునుండియైన వాపి శబ్దము పుట్టి యుండవచ్చును. అనంతపురము జిల్లాలోని ఒరువాయి, పాలవాయి, మేళవాయి, వాడ, వాడి, ఆడ, ఆడి, ఆల. సం. వాట; బెంగాలీ-ఒరియా: పాడా, మరాఠీ-గుజరాతీ: వార్; ఉదా. ధార్‌వార్, మార్‌వార్. అనంతపురము జిల్లాలో:నిధనవాడ, బొందలవాడ.

5. అరి: సం. గృహిక = ఘరియా; బంగాలి: హరి, తక్కినచోట్ల 'అరి'. ప్రాచీనబంగాలీ: పురాణ వృందికాహరి. అనంతపురం జిల్లాలో, కామారి (పల్లి).

6. కొండ: సిలాకుండ (6-వ శతాబ్దిలోని తూర్పు బంగాళీ తామ్ర శాసనములో) యస్. కె. ఛాటర్జీగారు 'కుండ' ను కొండ అని అర్థము చేసిరి. ఆ శాసనముల సంపాదకుడు ఆ పదమునకు చెరువు అని అర్థము చెప్పెను. కావచ్చును. అనంతపురములో ఎనిమిదిగ్రామముల పేర్లకు 'కొండ' అని చేర్చబడినది. అవి కొండలకు సమీపముననే యున్నవి.

7 కుంట, కుంట్ల: సం. కుండ (=సరస్సు) ఈ జిల్లాలో 23 కుంటలు 5 కుంట్లలు ఉన్నవి.

8. క్రీ. త. 5-వ శతాబ్దపు తూర్పుబంగాలీ తామ్రశాసనములో ధ్రువిలాటి అని ఉన్నది. దానిని ధ్రువబిలవాటి అని ఛాటర్జీగారు చదివిరి. 'వటి' అనగా గృహము, లేక గ్రామము. లేదా తటి (=ఒడ్డు) నుండి ఇది ఏర్పడి యుండవచ్చును. అనంతపురముజిల్లాలో పామిడి, మోపిడి.