పుట:Andhra bhasha charitramu part 1.pdf/710

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సోలీ డావుకొచ్చాకు - South by East - సోలీకి కుడివైపు 11 డిగ్రీల 15 మినిట్ల ఎడములో నుండు కొచ్చాకు.

సోలీడావుతీరు - South-South-East - సోలీకిని ఆగ్నేయమునకును సరిగా మధ్యనుండు దిక్కు.

స్కూనరు - Schooner - రెండుకొయ్యలఓడ. ఈ ఓడలో ఒకకొయ్య మీదమాత్రమే చాపలు, పరమానులు ఉండును. రెండవకొయ్యమీద గావుటావులు మాత్రము ఉండును.

హెచ్చుపదును - 1. Spring tide - చంద్రుడు ఒకటి, మూడు పోయంట్లలో ఉన్నప్పుడు సముద్రము హెచ్చుగా పొంగును. అప్పుడది హెచ్చుపదునులో ఉన్నదందురు.

2. సముద్రము పోటుగా ఉన్నప్పుడుకూడ హెచ్చుపదునుగా ఉన్నది అను వాడుక కలదు. చూ. పోటు.