పుట:Andhra bhasha charitramu part 1.pdf/697

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తయార్ జాగా! - Same as తయార్ ! Ready about!

తరపాలు - Tarpawlins - వెడల్పైన కేన్వాసు గుడ్డలు. వీటికి బాగుగా తారు పూయుదురు-వీనిని కుతిలీమీది పాలకాయలమీద పఱతురు. అందువలన వర్షము వచ్చినను మరి యేలాగో నీరు హెచ్చుగా నున్నప్పు డది తండాలోనికి వెళ్లకుండ నిలుచును.

తరము - List - ప్రక్కకు ఒరగుట - "ఓడ జేరుకు తరముగా ఉన్నది" = జేరుబోడిద వైపు ఒరగిఉన్నది.

తలారికొట్టు - Cockpit - జబ్బుగా ఉన్నవారు పడుకొనుటకు ఓడలో ఉండుగది - యుద్ధములో గాయములు తగిలినవానిని పూర్వ మీగదిలో ఉంచుచుండిరి.

తాకి తేలుట - Afloat - ఓడ నేలకుతాకి ఉన్నప్పుడు నీరు హెచ్చయి తేలుట.

తాడు ఒత్తులుఅగుట - Loose - తాడు వదులగుట.

తాడు బారుచేయుట - To belay - తాడు ఒత్తాలుగా నుండిన బిగువుగా లాగుట.

తాడు చెరిసగము చేయుట - Bight - రెండు కొనలనుకలిపి తాడు దళముగా ఉన్నట్టు చేయుట.

తాడు వొరా వేసుక పోవుట - Kink - అమారుగాని, మరి యేతాడుగాని మలతలు పడుట.

తిరగతి ఓడ - Brig - రెండు కొయ్యలుకలిగి ఆరెండింటికిని చాపలు, పరమానులు ఉన్నఓడ.

తిరగబడుట - Capsize - ఓడ ప్రక్కకు పడిపోవుట.

తిరగతి కొయ్య - అమరము దగ్గఱనున్న కొయ్య.

తీరు - Crane - బరువైన వస్తువులను మీదికి ఎత్తుయంత్రము.

తీరులు - అకరాబులకును, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణములకును సరిగా మధ్యనుండు దిక్కులు. చూ. సమకా.

తీరుకర్రలు - Chestrees - ఓడప్రక్కలను అమర్చబడిన కఱ్ఱలు. ముఖ్యమైన త్రాళ్లన్నియు ఈ కఱ్ఱలలోని బెజ్జముద్వారా పోవును.

తూర్పు అకరాబు - North-east తూర్పునకును ఉత్తరమునకును సరిగా మధ్యనున్న దిక్కు. చూ. సమకా.