కేమిరి - Cabin. రూ. కామిరీ.
కొచ్చారకులు - 1/82. Part of the Mariner's Compass - కంపస్సులోని 360 డిగ్రీలలోను 32-వ వంతు.
కొండగాలి అకరాబు - South - east ఆగ్నేయదిశ. చూ. సమకా.
కొండగాలి అకరాబు - జమ్నా - కొచ్చాకు - South - East by East - కొండగాలి అకరాబుకు అనగా ఆగ్నేయదిశకు ఎడమవైపు 360 డిగ్రీలలో 32-వ వంతు డిగ్రీలు గలదిక్కు. చూ. సమకా.
కొండగాలి అకరాబు - డావు - కొచ్చాకు - South - East by South - ఆగ్నేయదిశకు కుడివైపు 360 డిగ్రీలలో 32-వ వంతు డిగ్రీలు చూపుదిశ. చూ. సమకా.
కొడి - Leach - కొడులు; Leaches - తెరచాప అంచులు.
కొడి - A standard or flag; కొడికాయు To hoist a flag; కొడీస్తంభము; a flag staff; కొడిమె = a ship or boat.
కొత్తకొయ్య - Jury mast - విరిగిపోయిన ఒకకొయ్యకు బదులుగా తాత్కాలికముగా ఉపయోగించుటకు ఎత్తిన కొయ్య.
కొయ్యసెల - Aloft - కొయ్యకు మిట్టమీది భాగము.
కోడేకొయ్య - Beacon - పల్లపు నీటి జాగాలోను, ఇనుక దిబ్బమీదను, చిన్నగుట్టలమీదను, నావలకు అపాయము తెలిపే ఒక కొయ్య లేక స్తంభము. చూ. సైను.
కోతాంబొత్తలు - Limbers or Limber holes - తట్టు మీది నీరు పైకిపోవు బొక్కలు (కన్నములు).
క్వాడ్రాంటు - Quadrant - సూర్యుని స్థానమును కనుగొనుట కుపయోగించు ఉపకరణము. చూ. కమాను. రూ. క్వార్టరు.
క్వార్టరు - Quadrant - చూ. క్వాడ్రాంటు.
గందరాపెట్టకు - Steady ! - గాలి తిన్నగా వీచుచున్నప్పుడు ఓడ ఒక ముజరామీద వెళ్లుచుండగా "అదే ముజరామీద వెళ్లు, ఆ ముజరా తప్పించకు" అని చుక్కాణిదారుని ఆజ్ఞాపించుట.
గందరావెళ్ళకు - Nothing off ! గాలి వీచుచున్న మార్గమునుండి ఓడను తప్పించవలదని చుక్కాణిదారునికి ఆజ్ఞ.
గావుటాపులు - చిన్న చాపలు.