పుట:Andhra bhasha charitramu part 1.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'ధ' తోడిరూపమే సరియైనది. 17. మండలా. 18. పధనసనియ. 19. మానం. 20. చారానం. 21. ఎకసూరస - దీని నొక పండితుడు చదువక విడిచినాడు. 22. పరాక. 23. చ్చణయనుస. 24. నభాగ. 25. భుతం. 26. గరుడ. 27. ణగి. 28. డెవియ. 29. ఖమా. లోని 'మా' మీది ఆత్వము సంశయాస్పదముగా నున్నది. 30. హింసా. 31. వధూసదమ్. 32. [కెలాస] ప [వత] - అని యొకరు పూర్తిచేసినారు. 33. విమా[న] - అని యొకరు పూర్తిచేసినారు. 34. పతామ, పితామ ('పి' మీదిగుడి యింకను కానవచ్చుచునేయున్నది.) 35. నియా. యానభి." 36. సంఘన. 37. చితనా. 38. సెనాకామొ. 39. ణ [తా ... ... ... దఖిణా.] 40. పరిసరో. 41. గామం. 42. పీసాచి.

నాసికయందలి యీ శాసనములో లేఖకుడు సున్నలను, జడ్డక్కరములను, ఏ ఓ లమీది దీర్ఘములను చెక్కక విడిచినాడు కొన్నిచోట్ల క్రింది యొత్తులు కానవచ్చుచున్నను నవి క్వాచిత్కముగానే యున్నవి. ఈ శాసనములందు ఋ ఌ ఐ ఔ: ఙ ఫ ష అను నక్షరములు కానరావు. చ్ఛొత, ఒత్తరాహ అను పదములయందు హ్రస్వ ఒకారమును, చెతియ, నెకమ అను పదములయందు హ్రస్వ ఎకారమును నున్ననని యూహింపనగును. శవర్ణ మీశాసనములందు సాధారణముగ కానరాక సవర్ణముగానే యున్నది. శవర్ణము మాగధీ ప్రాకృతమునకు సంబంధించినది. అయినను కుశణ, శొర్పా-రగ, శక, సకశ=శకస్య అను పదములయందు శవర్ణము కానవచ్చుచున్నది. సాధారణముగ నేకాక్షర ద్విత్వములే కానవచ్చుచున్నను, ణ్హ, న్హ, య్హ, ర్ణ, ర్ప, లు కనబడుచున్నవి. పదమధ్యమందు కేవల మచ్చులుండుట 'మహా అరియక,' 'పులుమాఇ,' 'పనఇత' అను పదముల మధ్యమందచ్చు కనబడుచున్నది ణకారముతో శబ్ద మారంభింపవచ్చును;

ఉదా. ణియాతం (నిర్యాచితమ్)

అచ్చులయందలి మార్పులు.

సంస్కృతమునందలి యచ్చు లీ క్రింద విధముగా నాసికయందలి యాంధ్ర శాసనములందు మాఱినవి.

అ = అ - పనత (పర్వత)

అ = ఈ - సవీచ్ఛరే (సంవత్సరె)