ఈ పుట ఆమోదించబడ్డది
శ్రీ
ఆంధ్రాభాషా చరిత్రము
ఉపోద్ఘాతము.
ఆంధ్రభాష ద్రావిడభాషలలో నొకటిగా నేడు పరిగణింప బడుచున్నది. ద్రావిడ భాషలకును ఇండో యూరోపియను భాషలకునుగల సంబంధమును గూర్చి వివిధాభిప్రాయము లున్నవి. ఈ యభిప్రాయములు మఱియొక యధ్యాయయనందు వివరింపబడును. ఆంధ్రభాష యిప్పటి స్వరూపముతో క్రీస్తుశకము 8 వ శతాబ్దము నుండియు నుండినట్లు నిదర్శనములు కానవచ్చుచున్నవి.
భరతవర్షమున వాడుకలోనున్న భాషలలో జనసంఖ్యనుబట్టి యాంధ్రభాష మూడవస్థానము నాక్రమించుచున్నది.. హిందీ, బంగాళీ భాషల తరువాత నెక్కువ ప్రచారములోనున్నదియు నెక్కువ ప్రదేశమునందు వాడుకలో నున్నదియునగు భారతీయభాష యాంధ్రభాషయే. ఈ గ్రంధ వివరములు లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా, 4- పుటమునుండి తీసికొనబడినవి.
ఆంధ్రము గృహభాషగానున్న వారిసంఖ్య.
1891 సం. జనాభా | 1901 సం. జనాబా | |
మధ్యపరగణాలు | 99,527 | 79,927 |
చాంద | 69,000 | 71,789 |
బస్తరు | 30,527 | 8,138 |