పుట:Andhra bhasha charitramu part 1.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంధికలుగనిచోట్ల స్వరముకంటె పరమయిన స్వరమునకు యడాగమము వచ్చి యారెండచ్చులను బ్రత్యేకముగనిలుపును.

య, వ, లుకాక తెనుగున నిట్టిసందర్భములందు ట్, మ్, ర్, లు గూడ జేరుచుండును. ఉదా: పేరుటురము, గణగణమని, పేదరాలు.

వ్యవహారమునందు 'వ్‌' 'హ్‌' లు కూడనొకప్పుడు వచ్చును: ఉదా. ఆవూరు, పదిహేను మొద

వ్యవహారమునందు 'ఆ' 'ఈ' లకచ్చుపరమగునపు డుపైత్తమ వర్ణముల వారియందు యడాగమము కలుగదు: మాఅమ్మ, మీఅత్త; పామరజనుల వాక్కునందు మాత్రము యడాగమము వినబడును: మాయమ్మ, మీయత్త. ______________________________________________________________________

వర్ణమును దద్వికారమగు నివర్ణమునుగూడ ద్రుతసంజ్ఞను పొందవచ్చునని తేలుచున్నది. ను వర్ణమును ద్రుతముగా నంగీకరించినయెడల చింతామణి కర్తృతా విషయమున నొక యాక్షేపము కలుగుచుండుటచే వారీ వాదమార్గము ననుసరింపవలసివచ్చెను. 'ను' వర్ణము కేవల ద్రుతముగా నుండు ప్రయోగములు నన్నయ భారతభాగమున లేవని స్థాపించుటకు శాస్త్రులవారు ప్రయత్నించుచు, ను వర్ణము గానవచ్చినచోట్ల సముచ్చయార్థమును జూపుచు నది సముచ్చయ 'ను' వర్ణముగాని ద్రుతముకాదని త్రోసిపుచ్చుచు వచ్చిరి. కాని, ను వర్ణము కేవల ద్రుతముగా నున్న నన్నయభట్టకృత భారత భాగమందలి ప్రయోగముల గొన్ని యీ క్రింద పొందుపఱుప బడినది.

1. మ. జననీ శాపభయ ప్రపీడిత మహా-సర్పేంద్రులన్ సర్పయా
       గమిత్తోర్ధత మృత్యువక్త్ర గతులం - గాకుండగా గాచె నం
       దును నాస్తీక మునీంద్రు నందుల సద - స్యుల్ సంతసంబంది బో
       రన గీర్తించిరి సంతత స్తుతి పదా - రావంబు రమ్యంబుగన్ - ఆది. II. 287.

2. మధ్యాక్కర. తను మధ్య దా నొక్క కన్య సురనదీ - తటమున నన్నుఁ
            గనిన నక్కన్యకఁ జూచి నీ విట్టి - కమనీయ రూప
            వొనర నా సుతునకు భార్య పగుమన్న - నొడబడి యియ్య
            యనియెఁ గావునను దానిని దగ వివాహ - మగుము నెయ్యమున.
                                                     ఆది. IV. 141.

   మధ్యాక్కఱ. తడయక పుట్టిననాడ తల్లిచేఁ - దండ్రిచే విడువఁ
            బడితి నిప్పుడు పతిచేతను విడువఁ - బడియెద నొక్కొ
            నుడుపులు వేయు నింకేల యిప్పాటి నోములు దొల్లి
            కడఁగి నోచితిని గా కేమి యంచును - గందె డెందమున- ఆది. IV. 102

   ఆ. వె. ఎట్టి సాధ్వులకును బుట్టిన యిండ్లను
         బెద్దగాల ముండఁ - దద్ద దగదు.- ఆది. IV. 66.
         ఇట్టి యుదాహరణముల నింకను నీయవచ్చును.