పుట:Andhra bhasha charitramu part 1.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఙ: ఈ యనునాసికాక్షరము ప్రాకృతమునందు లేదుగాని, దాని యుచ్చారణము 'మంగలో' మొదలగు శబ్దములందు కవర్గమునకు బూర్వము వినబడుచున్నది.

ఞ: రాజ్ఞ: = రఞ్ఞొ: తాజ్ఞా = రఞ్ఞ, ప్రజ్ఞా=పఞ్ఞ; జ్ఞాతికానామ్=ఞతికానం=ఞ్ఞతికాణం; అఞే=అన్యే, హంఞంతి=ఆలభ్యంతే, మొదలగు శబ్దము లశోకుని శాసనములయందును బాలి భాషయందును, మఱికొన్ని ప్రాకృతములందును గానవచ్చుచున్నది.

య: ఇది ప్రాకృతమునందు లేదందురు.కాని, యర్థమాగధ్యాది భాషలయందిది యుద్వృత్తాచ్చుతో జేరి పలుకబడును, గత = గఅ = గయ; కృత = కఅ = కయ, మొద.

శ: మాగధీ భాషయం దిది ప్రత్యేకముగ నున్నది. ఇది పైశాచీ భాషయందును గలదు. అశోకుని శాసనములనుండి యుదాహరణములు.

కాల్సీశిల, 4: దువాడస నశాభిసితేనా పియదశినా = ద్వాదశవర్షాభిషిక్తేవ ప్రియదర్శినా.

కాల్సీశిల, 10: శంథుత=సంస్తుత:= పశవతి = ప్రసూతే.

12: శాలావఢి = సారవృద్ధి: ; సియాతి = స్యాదితి,

శవపాశడానా = సర్వపాషండానామ్; తశ = తస్య.

అతపశడ = ఆత్మపాషండే: పాశండ=పాషండ; శయా = స్యాత్; అపకలనశి = అప్రకరణే.

కాల్సీశిల, 13 ; లేఖాపేశామి = లేఖాపయిష్యామి.

ష: అశోకుని శాసనములనుండి: కాల్సీశిల, 10: యషో = యశన్: అపపలాషవే షియాతితి = ఆపపరిస్రవ: స్యాదితి; ధంమ సుసుషా = ధర్మ శుశ్రూషా, పియదషి = ప్రియదర్శీ, ఏషే = ఏష: ; షవం = సర్వమ్; ఉషుటేస = ఉత్కృష్టేవ; కల్సీశిల, హేడిషే = ఈదృశమ్: ధమష = ధర్మస్య; అదిష = యాదృశమ్; షంబంధే = సంబంధే, దాష = దాస; షమ్యాపటిపతి = సమ్యక్ప్రతిపత్తి: ; మాయపితిషు = మాతాపితృషు; షుషుషా = శుశ్రూషా ; షవామిక్యేన = స్వామినా ; షాధు = సాధు; ఏతిషా = ఏతేషామ్; షంఖేయే కాలనం = సంశయకారణమ్; షేషాయా = తత్స్యాత్, మొద.

అచ్చ తెలుగు.

'అచ్చ తెనుగు' అనుపదమును గూర్చి వేఱొకచో విచారింపబడినది. తత్సమేతరమైన, అనగా సంస్కృతసమేతరమైన తెనుగు భాష యచ్చ