పుట:Andhra bhasha charitramu part 1.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొన్నిభేదములను దెలిపియున్నారు. ఈప్రాకృతము లన్నిటిలో గల వర్ణ సమూహము నెంచినచో బైవివరించిన ట్లేబది వర్ణము లేర్పడును వానిలో వివాదమునందున్న వర్ణములకు గ్రమముగ నుదాహరణము లీక్రింద జూపబడినవి.

ఋ: అపభ్రంశము: తృణు = తృణమ్ (హేమచంద్రుడు 4, 329; నమిసాధు); సుకృదు (హేమచంద్రుడు 4, 329) సుకృదం (క్రమదీ; శ్వరుడు 5, 16) = సుకృతమ్; గృణ్హఇ = గృహ్ణాతి; గృహంతి = గృహ్ణంతి-గృణ్హేప్పిణు =* గృహ్ణిత్వన = గృహీత్వా (హేమచంద్రుడు 4, 336; 341; 2 394, 438). కృదంతహో = కృతాంతస్య (హేమచంద్రుడు 4, 370, 4) చూలికా పైశాచి ఖృత, ఖత = ఘృత (క్రమదీశ్వరుడు 5, 102).

ఎ: (1) ఐ = ఎ మహారాష్ట్రి, అర్ధమాగధి, జైన మహారాష్ట్రి, శౌరసేని, మాగధి: తెల్ల = తైల

మహారాష్ట్రి, జైన మహారాష్ట్రి, అర్థమాగధి: చెత్త = చైత్ర: *(కర్పూరమంజరి 12, 4, 9, విద్దసాల ణంజక 25, 2, క్రమదీశ్వరుడు 19; ఆయా రంగసుత్త 2, 15, 6, కప్పసుత్త).

మహారాష్ట్రి, జైన మహారాష్ట్రి: మెత్తీ = మైత్రీ (హాలుని సప్తశతి రావణవహ; క్రమదీశ్వరుడు 7)

మహారాష్ట్రి, జైన మహారాష్ట్రి, శౌరసేని. వెజ్జ = వైద్య (హేమ చంద్రుడు 1, 148; 2, 24; హాల్ని సప్తశతి; విక్రమోర్వశీయము 47, 2; మాలవికాగ్నిమిత్రము 26, 5; కర్పూరమంజరి 104, 7), మహారాష్ట్రి, శౌరసేని: సెణ్ణ = సైన్య.

(2) ఏ = ఎ: మహా; అ మాగ, జై. మహా: పెచ్ఛఇ=ప్రేక్షతే హేమచంద్రుడు 4, 181; గౌడవహో, హాలుడు, రావణవహ; ఒవవా ఇయసుత్త); అ మాగ. పెచ్ఛణిజ్జ = ప్రేక్షణీయ: పెచ్ఛగ (ప్రేక్షక); జై. శౌర పెచ్ఛది (ప్రేక్షతే); శౌర పెక్ఖది (ప్రేక్షతే); మాగ. పెస్కది (ప్రేక్షతే); మహా అవెక్ఖి = అపేక్షిణ్ మహా-దుప్పెచ్ఛ=దుష్ప్రేక్ష్య=శౌర. దుప్పెక్ఖ=మాగ. దుస్పెస్క; దుబ్భెజ్జ (దుర్భేద్య); అ. మాగ. జై. మహా., శౌర., అప.,: మెచ్ఛ (మ్లేచ్ఛ); మహా.: ఛెత్త (క్షేత్ర)=శౌర. షెత్త; మాగ. ఏశెక్ఖు (ఏషఖలు=ఏశేఖు).

(3) ఇ = ఎ: సాగర ఇతి = మహా. సాగరెత్తి; వేదము: యుష్మేస్ధ=మహా. తుమ్హెత్ధ అ+ఇ=ఎ: మాగ. పుత్త కెత్తి (తుత్రక ఇతి).