పుట:Andhra bhasha charitramu part 1.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36. - సరి ; సం. - సదృశ; ప్రా. సరిఅ.

కంటసరి, లగ్గసరి, లాలసరి.

iii. సహాయక క్రియలు.

ధాతువుల యర్థమును వివరించుటకును, వానికి విశేషార్థములను గల్పించుటకును, గొన్నియెడల స్వార్థమునందును దెనుగున ననేక సహాయక క్రియలు వాడుకలోనున్నవి. కొన్ని యెడలనివి విశేష్యములపై జేరి క్రొత్త సమస్తధాతువుల నేర్పఱుచుచుండును. ధాతువులతో జేరునప్పడవి కేవల ధాతువుల మీదనేకాక, వాని క్త్వార్థక, తుమున్నంతాది రూపముల మీదగూడ జేరుచుండును. ఈ క్రింది సహాయకక్రియలు తెనుగున నున్నవి. ఇవిప్రత్యయములు కాక ప్రత్యేక ధాతు రూపమున నున్నను, వీనికి బ్రత్యయ లక్షణములన్నియు నున్నవి. వీనికి సంస్కృత మూలము లింతకు ముందు తెలుపబడినవి.

1. అంటు.

విశేష్యములపై: అడుగంటు, తలయంటు, వెన్నంటు.

2. అంపు.

తుమున్నర్థకముపై: సాగనంపు.

3. అందు.

విశేష్యముపై: వియ్యమందు.

4. అగు.

విశేష్యములపై: ఊకువగు, తీలగు, దాపురమగు, వెండిలియగు, వెంపగు, పొట్టు పొరలగు, బైలగు, రూపగు, వెలవెలనగు, వెల్లనగు, సదమదమగు, సరియగు.

5. అడగు.

విశేష్యములపై: ఉక్కు; గండు -; గీటు -; పొడవు -; రూపు -; గోను.

6. అడచు.

విశేష్యములపై: చక్కు -; చదురు -; దిసంతు -; నామము -; పొడవు -; మదము -; వాదు.

7. అదలు.

అవ్యయముపై: గ్రక్కదలు.