పుట:Andhra bhasha charitramu part 1.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29. -అలికము; సం. -(అ)తి(కా)

ఉమ్మలికము (ఉమ్మ).

30. -అవ; సం, -తవ్య.

చొరవ*(చొరు); కలవ (కల); తడవు (తడ);

31. -అవము; సం.-తవ్య.

బుజ్జవము (బుధ్).

32. -అవి; సం.-తవ్య.

మనవి (మను); సరవి, స్రావి (సృ);

33. -అవు; సం.-అ+ఉ+కా.

ఉరవు (ఉరు); ఎగవు (ఎగు); కెడవు (కెడ); కెలవు (సం.ఖేల్); తగవు (తగు); చనవు (చను); నగవు (నగు); నెగవు (నెగు, ఎగు); పొడవు (పొడు); సెలవు (చల్); అగవు (అగు); నెరవు (నెరి); నెఱవు (నెఱి); నెళవు (నెల).

34. -అసము; సం.- త్య.

గెంటసము (గెంటు); తారసము (తారు); రాయసము, వ్రాయసము (వ్రాయు); దీమసము (దీము); దీవసము (దీవు=ధీము=ధీరము); బరవసము (భార); వెక్కసము (వెక్కు).

35. -అసి; సం.-త్య+ఇకా

రూపసి (రూపు.)

36. -అళము; సం.-అల-వందిన, ప్రా ఆల, అల,

జావళము, బంగళము, మాదళము.

37. -అగము; సం.-అక.

సరాగము (సృ).

38. -ఆట. సం. వృత్త; ప్రా. వట్ట, అట్ట, ఆట.

i. ఉరియాట, కారాట, కొనియాట, గోజాట, తిట్టాట, తీర్థమాట, దండాట, పోరాట, బండాట, మాఱాట, ఱంకాట, హోరాట, పొరలాట.

ii. బహువచనములమీద:-

ఇగ్గులాట, ఊగులాట, గ్రుద్దులాట, చిమ్ములాట, చెరలాట, చెర్లాట, నవ్వులాట, పీకులాట, పెనగులాట, పోట్లాట.

39. -ఆటన. సం. వర్తన; ప్రా. వట్టన,-ఆటణ.

గుంజాటన.