పుట:Andhra bhasha charitramu part 1.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అఱువు (రిశ్); అలువు (రుష్); ఉడువు (ఉపహృ); ఊవు (ఊద్వీజ్); ఎసవు (ఏష్); ఒదువు (వర్ధ్); ఒసవు (ఉపాస్); ఓవు (ఉపహృ, ఉదాహృ); చెరువు (చక్ష్); చెలవు (ఛిద్); చదువు (శబ్ద్); తడవు (తడ్); తలవు (తౄ); తవు (స్థగ్), తొడవు (ధృత); త్రావు (తృష్); త (త్ర)వ్వు (తక్ష్, త్రక్ష్).

2. ధాతువు: అవు (భ్రూ; ప్రాకృతము: ఓ, అఉ, అవు); పోవు (ప్రగ.)

52.-వ్వు.

ఒవౄ (ద్ఫాహృ, అవఃర్); కవ్వు (చూ. కవల); కివ్వు (క్లిశ్). చివ్వు (ఛిదాప్); త్ర (త్రె)వ్వు (త్రక్ష్).

53. -సు

తెనుగున సు వర్ణాంతధాతువులు లేవు. 'సరసు' అనునొకటి శబ్దరత్నాకరమున జేరినది. ఇది. హిందూస్థానీ భాషనుండి చేరినదేమో. సంస్కృతమున దీనికి సంబంధించిన శబ్దములు 'సదృశ, సరస, సంవృష్‌' అని చెప్పవచ్చును.

ధాతువులు.

తెనుగుధాతువులనొకచో జేర్చిన ధాతుకోశ మింకను నేర్పడలేదు; శబ్దరత్నాకరమున జేరిన ధాతుసముదాయమే మన పరిశీలన కాధారముగ జేకొనవలసియున్నది. ఈ ధాతువులలో 1. మూలధాతువులు, 2. మూలధాతువులనుండి యనేకవిధముల బుట్టినధాతువులు, 3. కృత్తద్ధితరూపములనుండి పుట్టినధాతువులు, 4. ధ్వన్యనుకరణబోధకధాతువులు, నని నాలుగుతరగతులుగ నున్నవి. ఇవియన్నియు సాధారణముగ నాంధ్ర వాఙ్మయమున బూర్వకవులచే వాడబడినవై యున్నవి కవిప్రయుక్తములుకాని ధాతువులు కేవలవ్యవహారస్థములైన ధాతువులును గొలదిగ నీనిఘంటువున జేరకపోలేదు. పూర్వకవులుపయోగించిన ధాతువులలో గొన్ని నేడు వ్యవహారభ్రష్టములైనవి. వ్యవహారచ్యుతి నొందని కొన్నిధాతువులు నేడు క్రొత్తయర్థములను బొందినవి. ఇవిగాక ధాతునిర్దేశము చేయ వీలులేని కొన్ని క్రియారూపములు మాత్రము భాషయందు నిలిచియున్నవి.