పుట:Andhra bhasha charitramu part 1.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేత, నతడు పీటర్ ది గ్రేట్ అను చక్రవర్తిని ప్రేరేపించి యాతని రాజ్యమున వాడుకలోనున్న యన్నిభాషలకును సంబంధించిన పదసముదాయములను సమకూర్పింప బ్రయత్నించినాడు. కేధరీన్ (II) చక్రవర్తినికిగూడ నిట్టిపనియందు చాలకుతూహల ముండెడిది. ఈ రాజాదరమువలననే 'పల్లాను' (1786 - 87), హెర్వాను (1800 - 5), ఆడెలుంగు (1806 - 17), అనువారు తమ నానాభాషాకోశములను రచించినారు. ఈ నిఘంటువులలో లోపములు లేకపోలేదు. వీనిలో విమర్శదృష్టి లేదు. అన్నిభాషలను గుఱించియు నొకటే రీతిగా వీనిలో వ్రాయలేదు. నైఘంటుక విషయములే వీనిలో నెక్కువగాని, వ్యాకరణవిషయము లెక్కువగా లేవు. బైబిలుగ్రంథము మాత్రమే వీనికాధారము. అయినను నీ కోశము లానాడు చాలముఖ్యములుగా నుండెడివి. వైయాకరణులు వానిని ప్రమాణగ్రంథములుగా తలంచి, వాని యాధారమున బరిశోధనలుచేయుచుండిరి. ఈపరిశోధనములమూలముననే పందొమ్మిదో శతాబ్దమున భాషాశాస్త్రమునకు గ్రొత్త జీవము వచ్చినది. ఇదిగాక, భాషా శాస్త్రమునకు శబ్దజాలముకాక వ్యాకరణమే ముఖ్యమని తలంచినవారిలో పైని చెప్పిన హెర్వాసు పండితుడే మొదటివాడని జ్ఞాపక ముంచుకోవలెను.

సామ్యభాషాశాస్త్రము (Comparative Linguistics) ఆరంభము కాకమునుపు భాషలనుగుఱించియు, భాషాబోధనముగుఱించియునెట్టి యభిప్రాయము లుండెడివో కొంచె మాలోచింపవలసి యున్నది. అభ్యసింపదగిన భాష లాటిను. పండితులకు బరిచయముండిన వ్యాకరణము లాటిను వ్యాకరణము. అందుచేత, వ్యాకరణమనిన లాటినుభాషావ్యాకరణమనియే చాలమంది యభిప్రాయమై యుండెను. ఇప్పుడు పిల్లలు నేర్చుకోవలసిన ముఖ్యవిషయములు దేశభాష,శాస్త్రము, చరిత్రము, మొదలయినవి; కాని, ఆకాలములో వీనిని బోధించుచుండలేదు. బడులలో లాటినుభాషావ్యాకరణమే ప్రధానపాఠ్యవిషయముగా నుండెడిది. ఇప్పుడు 'సెకండరీస్కూలు' అని చెప్పబడెడు పాఠశాలకు అప్పుడు - చాలకాలమువఱకు - 'గ్రామరుస్కూలు' అనియు, డెన్మార్కుదేశములో 'లాటిన్ స్కోలె' అనియు పేళ్ళు. ఈపేళ్ళు కలుగుటకు కారణము లాటిను భాషమీది యభిమానమే. సామాన్యముగా భాషాశాస్త్రము విషయమై లాటిను భాషాపరనమునకు గల ప్రాముఖ్యమునుగుఱించియే మనమిప్పుడాలోచింపవలసిన విషయము; ఈ లాటినుభాష భాషాశాస్త్రవిషయమున ననేకవిధములుగా బ్రాముఖ్యమును వహించియుండెడిది.

లాటినుభాష ప్రకృతి ప్రత్యయ సంయోజనమువలన నేర్పడినది. అయినను నితరభాషా వ్యాకరణములనుగుఱించి ముచ్చటింపవలసి వచ్చినప్పు