పుట:AndhraRachaitaluVol1.djvu/456

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మల్లాది సూర్యనారాయణ శాస్త్రి

1880

వెలనాటి వైదిక బ్రాహ్మణులు. తల్లి: వేంకమాంబ. తండ్రి: శ్రీరామావధానులు. జన్మస్థలము: చినకడియపులంక (దీనికి బుర్రిలంక-మల్లాదివారిలంక యని నామాంతరములు) జననము 20.2.1880 సం. ప్రమాధి మాఖశుద్ధదశమి. గ్రంథములు: 1. సంస్కృతవాజ్మయచరిత్ర (2 భాగములు. ఆంధ్రవిశ్వకలా పరిషత్ప్రచురణములు. 1. వైదిక భాగము. 2. లౌకిక భాగము) 2. ఆంధ్రభాషానుశాసనము (2 భాగములు. చరిత్రాత్మకవ్యాకరణము) 3. ఆంధ్రదశరూపకము (తెనుగుసేత) 4. భాసనాటక కథలు (వచనము. 2 భాగములు) 5. ప్రేమ తత్త్వము (స్వతంత్ర పద్యకావ్యము) 6. ఉత్తరరామచరిత్ర (ఆంధ్రీకృతి) 7. భీష్మప్రతిజ్ఞ (స్వతంత్రనాటకము) 8. ఆంధ్రభవిష్యపర్వము (పద్యప్రబంధము) 9. భవభూతినాటకవచనము. 10. విదురనితి. 11. స్త్రీధర్మబోధిని. 12. సత్యకీర్తినాటిక. 13. కవివిడంబనము. 14. మహాభారత విమర్శనము.


సంస్కృతరచనములు: 1. బ్రహ్మసూత్రార్థదీపిక. 2. రజోనన్తర వివాహము. 3. సంస్కృతభాషా (ఇవి షష్టిపూర్తి సంపుటములో ముద్రితములు) అనేక పత్రికలలో వ్యాస రచనలు.


శ్రీ సూర్యనారాయణ శాస్త్రిగారు సంస్కృతాంధ్రములయందు గావలసినంత నికరమైన పాండిత్యము గలవారు. ఈ పాండిత్యమునకు దీటయినది వారికి గల యభినివేశము. సంస్కృతవాజ్మయ చరిత్ర, ఆంధ్రభాషానుశాసనము మున్నుగా వారు రచించిన కృతులు శాస్త్రిగారి పట్టుదలను బ్రదర్శించుటకు బట్టుగొమ్మలయినవి. ఆయనకు గవిగానున్న కీర్తికంటె, నధ్యాపకుడుగా విమర్శకుడుగానున్న పేరుపెంపులు పెద్దవి. ఏమనగా, సూర్యనారాయణశాస్త్రిగారు నలువది సంవత్సరములు ఉపాధ్యాయ పదవి నిర్వహించిరి. ఆ నిర్వహణములో