పుట:AndhraRachaitaluVol1.djvu/343

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేలూరి శివరామశాస్త్రి

1892

తల్లి: శ్రీవిశాలాక్షి. తండ్రి: వేంకటేశ్వరావధానులు. గ్రామము: చిరివాడ (కృష్ణామండలము). జననము: 1892 సంవత్సర ప్రాంతము. కృతులు: ముద్రితములు- 1. సోముడు లేక ఉత్తరహరివంశ విమర్శము (1919లో విరచితము) 2. ముక్తాలత ప్రబంధము. (1910 లో విరచితము) 3. తాలుకుట్టనము (విమర్శనము 1913 విర) 4. తెనాలి శతావధానము, కొవ్వూరు, చట్రాయి, తెనాలి, బెజవాడ, గుంటూరు కాలేజీ శతావధానములు. 5. కృతకసూత్రము (ఖండకావ్యము, 1910) 6. మాధవవర్మ (నాటకము) - 1920 ముద్రితము. 7. ఉపగుప్త. 8. బిడాలోపాఖ్యానము (పద్యకథ, 1911 ముద్రి.) 9. ఆత్మకథ (మహాత్మా గాంధీ జీవితము. వచనానువాదము 2 సంపుటములు) 10. కథలు - గాథలు (రవీంద్రుని వంగభాషలోని ' కథా ' యను గ్రంథమున కనువాదము 1940 ముద్రి.) 11. ఏకావళి (ఖండకావ్య సంపుటి. 1940 ముద్రి.) 12. రాముని బుద్ధి మంతనం. 13. సర్వేసు వీలునామా. 14. తీరనికోరికలు. 15. బాపనపిల్ల. (ఈ నాలుగును శ్రీ శరచ్చంద్రుని నవలల కనువాదములు.) 16. కథాషట్కము. 17. కథాసప్తకము.

శివరామశాస్త్రిగారు కావ్యరచనలో గథారచనలో గ్రొత్తవాటములు తీసిన గొప్ప రచయితలు. ఆంగ్ల వాజ్మయమున, సంగవాజ్మయమున, పరాసు వాజ్మయమున వా రెక్కడలేని గ్రంథములును జూచిరి. సంస్కృతమున జెప్పనేల ! వ్యాకరణము, న్యాయము, వేదాంతము గురుకుల క్లిష్టులై యధ్యయనముచేసిరి. ఆంధ్రవిషయమున వారి కృషి గూర్చి వేఱే వ్రాయను. శతావధానములు పలుచోటుల బోటీగా జేసిరి. ఆశుకవిత్వములు 'నీవా ? నేనా ? యని ప్రదర్శించిరి. ప్రబంధములు, ఖండకావ్యములు నవీన రీతులలో సంతరించిరి. సంగీ