పుట:Ananthuni-chandamu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వాగృజుత్వంబు భవదృషిత్వమున కమరె
నాఁగ ఋత్వవర్గ వ్యంజనముల సంధి.

58


గీ.

ఆదిఙఞణనమల పొల్లు లచ్చు లంట
స్వస్వరూపంబ యగు ఋత్వసంధి నైన
నడఁగు గుడి హలంతము నాఁ దిఙంతమన ని
కోయణచి నా ననృజువనఁ గూడుఁ గాన.

59


క.

పన్నుగ మకార హల్లగు
సున్న మకార మగు నచ్చు సోఁక సమగ్రం
బన్న మన ఋకారం బా
సన్నమ్ముగ మృత్వ మగు రససమృద్ధి యనన్‌.

60


క.

తమతమవర్ణంబుల ద్వి
త్వము లగుఁ దత్తరుణి తత్తదర్థము తద్దా
నము తద్ధనంబు తన్నయ
నము నా నిటు వర్గములఁ దనరు వ్యంజనముల్‌.

61


సీ.

వర్గహల్లుల చేరువను హకారము చతు
           ర్ధాక్షరం బై సంధి నడఁగు నొండె
మూఁడవవ్రాలతోఁ బోఁడిగ దీపింప
           స్రగ్ఘార మనఁగ నజ్ఘల్లు లనఁగ
షడ్ఢలంబులునాఁగఁ సకలజగద్ధిత
           ప్రౌఢిమనాఁగకుబ్భస్తు లనఁగ
నవియ స్రగ్‌హారంబు లనఁగ నజ్ఝల్లు ల
           నంగ షడ్‌హలములు నా జగద్‌ హి


ఆ.

తానువర్తను లనఁ గకుబ్‌ హస్తు లనఁగ
శపరమైన వాక్‌శాంతి వాక్ఛాంతి యట్ల