పుట:Anandam Manishainavadu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సేవా రమణీయం

...వైబోయిన బాబులు

జిల్లా ప్రధాన కార్యదర్శి,

రంగస్థల కళాకారుల సంఘ అధ్యక్షుడు, తాడేపల్లిగూడెం.

                                       కొంతమందికి పదవులు అలంకారం
                                       కొంతమంది పదవికే అలంకారం
                                       కొందరికి పదవులు అవసరం
                                       కొందరు పదవులకు అవసరం

ఆ రెండో కోణానికి చెందినవారే మా "రమణగారు". 16 వత్సరాలనుండి కళాకారుల సంక్షేమ సంఘానికి వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్నారు. కాని రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం 25వ వార్షికోత్సవం నిర్వహించడం, "రజత కమలం" సావనీరు (పుస్తకం) ఆవిష్కరించడం ఓ మైలురాయి. అది నిజానికి ఓ అద్భుతం. ఆ సమయంలో ఎవరు కార్యదర్శిగా ఉండాలనే సమస్య వచ్చినప్పుడు ఓ వ్యక్తిపేరు ముందుకు వచ్చింది, ఆయనే సూరంపూడి వెంకటరమణ. ఆయన కార్యదర్శిగా ఉండటానికి ముందు అంగీకరించలేదు. ఏమన్నారంటే "నా పరిచయాలను ఉపయోగించి సంఘానికి ఆర్ధిక సహాయం అందించవలసి వస్తుంద"ని ఆయన సంశయించారు. అయితే ఇంతకాలంగా అనేక పరిచయాలున్నా, ఏ ఒక్కర్నీ మా సంఘానికి ఆర్ధిక సహాయం చేయమని ఏనాడూ ఆయన కోరలేదు. అది ఆయనలోవున్న గొప్ప సుగుణం.

ఆయన సమర్ధత, పట్టుదల, కృషి, ఆలోచన, మా సంస్థకు అందించాలే తప్ప మరే విధమైన విషయాలలో జోక్యం చేయనక్కరలేదనే విషయాన్ని ఆయనకు చెప్పి, ఏమైనా ఆర్ధిక విషయంలో కావాలంటే నా పాట్లు నేను పడతాననే హామి రమణగార్కి ఇచ్చాకే ఎంతో ఆలోచించి రమణగారు కార్యదర్శి, సంస్థ కోశాధికారి పదవులను చేపట్టి సమర్ధవంతంగా వాటికి న్యాయం చేకూర్చారు. ఆపైన