పుట:Aliya Rama Rayalu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆకాలమున బుట్టినయీగ్రంథములన్నియు నళియరామరాయలు సలకము చినతిమ్మరాజు సైన్యములతో యుద్ధముచేసి యోడించి యుద్ధములో నాతనిసంహరించి సదాశివరాయని సామ్రాజ్యమునకు బట్టాభిషిక్తునిగాజేసి జగత్ర్పఖ్యాతి గాంచినట్లు దెలుపుచున్నవి. ఇవిమాత్రమే గావు; ఇటీవల కర్నలుమెకంజీదొరగారిచే సేకరింపబడి సంపుటీకరింప బడిన స్థానికచరిత్రములుగూడ పయిగ్రంథములలో వక్కాణింప బడినవిషయములను బలపఱచుటయెగాక మఱికొన్ని నూత్న విషయములనుగూడ దెలుపుచున్నవి. సొన్నలాపురముహండే హనుమప్పనాయు డీవిప్లవకాలమున నొకప్రధానపాత్రమును గైకొని యళియరామరాయలకు దోడ్పడినట్లు హండేవారిఅనంతపుర చరిత్రమునందును, అట్లే పెమ్మసాని యెఱ్ఱతిమ్మానాయడు తోడ్పడి నట్లు తాడిపర్తి కయఫియత్తునందును, అట్లే