పుట:Aliya Rama Rayalu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బెట్టి కొబ్బరిముక్కలను, ఐదువేలహొన్నులను బ్రాహ్మణులకు బంచిపెట్టెనట !'

ఇయ్యవి వట్టిపిచ్చికూత లనివిశ్వసింపవచ్చును. అళియరామరాయల భార్యలలో "సత్యభామాభాయి, దేవచింతామణి, త్రివేగల, మానమోహిని నిజస్వరాపి" యనువారలు లేనేలేరు. అళియరామరాయలకు నల్వురుభార్యలు గలరనియు నందొకామె కృష్ణదేవరాయల కొమార్తయగు తిరుమాలాంబ యనియు, ఇంకొకయామె జిల్లేళ్ల పెదనంది రాజయ్యదేవమహారాజుకూతురగు నప్పలాంబయనియు, తక్కినయిర్వురును పోచిరాజు తిమ్మరాజయ్య దేవమహారాజు కూతుండ్రగు కొండమ్మ, లక్ష్మమ్మయను వారనియు, రామరాజీయాది గ్రంథములవలన దెలిసికొన గలుగుచున్నాము. అళియరామరాయలతల్లి తిమ్మాంబకాని చంద్రశాలకాదని మనమెఱిగియె యున్నాము. తొంబదియాఱేండ్లవయస్సుగల రామరాయ లామెకు మూడవకుమారుడుగాని మొదటివాడు కాడు. అప్పటికాతనితల్లి బ్రతికియున్నదనికాని భయంకరమైన యుద్ధమాసన్నమైయున్నకాలమున భార్యలతో సరససల్లాపములాడుచు విలువగలనగల బహుమానము చేయుచుండెనని చెప్పెడివారు చెప్పినను విశ్వసించెడివారికి మతు లుండవనుకొనిరి కాబోలు ! ఇట్టిపిచ్చికూతలనే హీరాసుఫాదిరి ప్రామాణ్యములుగ బరిగణించి గ్రంథస్థవచేయుట మిక్కిలి