పుట:Aliya Rama Rayalu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములకాలములో దక్కనుసుల్తాను లైదుగురులో నొక్కడైనను హిందూసామ్రాజ్యముపై దండెత్తి రాకుండునటులు రామరాయలు మిగులభయంకరమైన యొకరాజనీతిపద్ధతి నవలంబించి యాప్రకారము నడచుచుండెను. ఈదక్కనుసుల్తానులలో నైకమత్యము లేకుండుట గనుపెట్టి వారికలహములలోదాను జోక్యము కలిగించుకొని యెవరిపక్షముననో యొకపక్షముననుండి వారికి దోడ్పడుచు బ్రతిపక్షము వారిని గదనరంగమున నోడింపుచు వారలను గ్రుకద్రిప్పుకొనకుండజేసి యెప్పుడును దానులాభముపొందుచు దనసామ్రాజ్యమును గాపాడుకొనుచు వచ్చెను. ఇత డవలంబించిన యిట్టి రాజనీతియె తుదకు దక్కనుసుల్తానులు పరస్పరకలహములను విడిచి యెల్లరు నేకీభవించి హిందూసామ్రాజ్యము నెదుర్కొను నట్లు గావించెను. ప్రతిసుల్తానుకు దాను ప్రత్యేకముగా విజయనగరసామ్రాజ్యముపై దండెత్తిపోయి రామరాయలను జయించుట సాధ్యముకాదని గ్రహింప గలిగిరి. మఱియు దమలో దా మైకమత్యములేక పరస్పరవిరోధములతో నుండి యుద్ధములు చేయుచున్నంతవఱకు రామరాయలను జయించు నట్టిశక్తికలుగదనికూడ దోచినది. ఇంక వారు చేయవలసినపని యేమి? ఐకమత్యము సంపాదించుకొన బ్రయత్నింపవలయును. వారిలో ముఖ్యముగా నహమ్మదునగరసుల్తా నగుహుస్సేను నిజాముషాకును, విజాపురసుల్తా నగుఆలీఆదిల్‌షాకు సరిహద్దుదుర్గముల విషయమై వివా