పుట:Aliya Rama Rayalu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

          "సీ. కటకాఖ్యకటకస్థకరటిరాడ్గజఘటా
                     సంభూతమదభరస్తంభకంబు,
              పాండ్యభూమీభృత్సభాసభాజితభటో
                     ద్భటభుజాబలగర్వభంజకంబు,
              మబ్ఖామహాదుర్గతుబ్ఖారపతివపు
                     స్థాయివేపధుసముద్ధానదంబు,
              డిల్లీపురాధీశపల్లవోష్టీభావి
                     విప్రలాభకదాభయప్రదంబు,

              రామనరనాధతిమ్మభూరమణపుత్ర
              విఠ్ఠలేశాభిధానపృధ్వీకళత్ర
              ధాటికారంభసంభ్రమధ్వనితపటహ
              గణసముత్థితధణధణంధణరవంబు"

ఇటువంటి మహాపరాక్రమశాలి యని యెఱింగియే యళియరామరాయ లీకార్యభారము నంతయు నీతనిపై బెట్టి తానును తనసోదరులును దక్కనుసుల్తానులతో నుత్తరదేశమున నాకాలమున బోరాడుచు దనరాజనీతిచాకచక్యత నంతయును గనుబఱచగల్గెను. విజయనగరసామ్రాజ్యమునకును పోర్చుగీసువారికి మనస్పర్ధలు విరోధము లున్నట్టుచూపున దీగ్రంథమొక్కటియె గాదు. ఇయ్యది హిందూపక్షమును దెలుపుప్రమాణగ్రంథము. విఠ్ఠలుడుదక్షిణదేశములో దండయాత్రలునడపుచు దిరువడిరాజ్యాధిపతితోను పోర్చుగీసువారిసాహాయ్యమును బడసిన పరవజాతివారితోను, తదితరసామంతశత్రువర్గము