పుట:Aliya Rama Rayalu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

      "సమితిలో జెఱకురాచనరేంద్రు గెలిచి
       అలవుగా సప్తాంగహరణం బొనర్చి
       పొలుపొందె భువిమన్నెపులి యనుపేర
       బిరుదాంచితుడు తాతపిన్నభూవరుడు."

అని తాతపిన్నమరాజును గూర్చి వక్కాణించి యటు పిమ్మట -

      "హరికాంత బోలు నూరాంబిక యందు
       ఘనశౌర్యు డౌకొటిగంటిరాఘవుని
       గనియె నతండు సంగ్రామంబు నందు
       రాజిల్లుకంపిలిరాయసైన్యముల
       దేజంబు మెరయంగ దెగువమై గెలిచి
       గరిమ గైకొనియె నగ్గండరగూళి
       బిరుదంబు నరినృపుల్ పేర్కొని పొగడ."

అని యతని ప్రథమభార్యాపుత్త్రు డయిన కొటిగంటి రాఘవరాజు వీరకృత్యములను వర్ణించియున్నాడు. నరపతివిజయమను గ్రంథమున వెంకయకవి తాత పిన్నమరాజు ప్రథమ భార్యనుగాని యామెకుమారు డగుకొటిగంటి రాఘవరాజును గాని ప్రశంసించినవాడుకాడు. తాతపిన్నమరాజు జయించిన చెఱకురాచనరేంద్రు డెవ్వడో యింతవఱకు చరిత్రమున కందియుండ లేదు. కాని వానికుమారుడు కొటిగంటి రాఘవరాజు యుద్ధమున గంపిలిరాయ సైన్యములను గెలిచి గండర