పుట:Aliya Rama Rayalu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుర్గమున దాగి యుండెను. ఇట్లుండ నతనియాంతరంగికమిత్రు డయినఇబ్రహీమ్‌కుతుబ్షా తాను రాజనీతిప్రాముఖ్యత ననుసరించి వానిశత్రుపక్షమున జేరినను తనహృదయము హుస్సేనునిజాముషా పక్షముననే యుండె ననియు, తాను శత్రుపక్షమున నున్నను వానికి దోడ్పడుదు ననియు, సాధ్యమగునంతకు దనశక్తియుక్తులను బ్రయోగించి శత్రువులను యుద్ధవిముఖులను గావించి మరలిపోవు నట్లుచేయుచు ననియురహస్యముగా నొకజాబువ్రాసి నిజాముషాకు బంపించెను. ఇట్లే అహమ్మదునగరదుర్గమును గాపాడుచున్నసేనాధిపతికి వ్రాయుచు, దుర్గమును వశపఱచక కడవఱకు బట్టుదలతో సంరక్షింపవలసిన దని ప్రోత్సాహపఱచుచు మఱియొకజాబు బంపించెను.

మిత్రసైన్యము లహమ్మదునగరదుర్గమును ముట్టడించి మిక్కిలిపట్టుదలతో రెండుమాసములవఱకు విడువకయుండుట చూచి ఇబ్రహీముకుతుబ్షా యుపేక్షాపరుడై యూరకుండక విజయనగరసేనానులకు లంచముల నొసంగుచు వర్షాకాలము సమీపించుచున్నదిగావున ముట్టడిమాని వారివారిసైన్యములు వారివారిదేశములకు బోవుటమంచి దనిరామరాయలకు జెప్పి మరలింపవలసిన దనిప్రోత్సాహ పఱచుచుండెను. మొదటరామరాయలు తనసేనానులు చెప్పెడుసలహాలనుబాటించి వెనుదీయుట కంగీకరించెనుగాని విజాపురసుల్తాను దీని నంతనుగ్రహించి రామరాయలకడకువచ్చి ముట్టడివిడనాడిపోవల దనియు, దుర్గములోనివారికి భోజనపదార్థములు సన్నగిలిపోవుచున్నం