పుట:Aliya Rama Rayalu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాయబారుల నవమానించెనట. వార లెట్లోతప్పించుకొని విజయనగరమునకు విచ్చేసి యాదుష్కృత్యమును రామరాయలకు విన్నవించి రట. [1] అంతరాయలాగ్రహముతో బీదరుసుల్తానగు ఆలీబరీదుషా విజాపురసుల్తా నగు ఇబ్రహీము ఆదిల్‌షాతో సఖ్యము చేసికొన్నాడు గనుక మున్ముందు కళ్యాణి దుర్గమును ముట్టడించుట మంచి' దని అహమ్మదునగర సుల్తానుకు దెలియ జేసెనట. ఈయుద్ధమును గూర్చి వ్రాయుచు ఫెరిస్తా రామరాయలుగాని హిందువులుగాని నిర్వహించిన కార్యమును లేశమాత్ర మైన నుదాహరించిన వాడుకాడు. శివతత్త్వరత్నాకర మనుగ్రంథమున నీయుద్ధమును గూర్చి ప్రస్తావించుచు నహమ్మదునగరసుల్తానున కిందుప్రవేశ మున్నట్లే యాగ్రంథకర్త చెప్పి యుండలేదు. ఇక్కేఱిమండలాధిపతి యగుసదాశివరాయకు డీయుద్ధమును సాగించుటకై అళియరామరాయనిచే నియమితుడై విజయనగర సైన్యముల కాధిపత్యము వహించి తొలుత కలుబరగిదుర్గమును ముట్టడింపగా విజాపురసుల్తాను బహుళసేనాసమన్వితుడై యెదుర్కొని యుద్ధము చేసెనట.

  1. ఇచ్చట హీరాసుఫాదిరి క్రొత్తవిషయమును బేర్కొను చున్నాడు. విజాపురసుల్తాను రామరాయలకడ రాయబారిని బంపగా రామరాయలు వానిని ఱాళ్లతో గొట్టించి చంపించె ననికోరియా వ్రాసినాడని 'కుక్కకాటుకు చెప్పుదెబ్బ' యన్నట్లు విజాపురసుల్తా నట్లుజరిగించినాడని హీరాసుపాదిరి వ్రాయుచున్నాడు. తనరాయబారులను రప్పించుకొనకముందే రామరాయలు విజాపురసుల్తాను రాయబారిని ఱాళ్లతో గొట్టి చంపించినా డనిచెప్పుట విశ్వాసపాత్రము గాదు.