పుట:Aliya Rama Rayalu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తన్నును తనరాజ్యమును సంరంక్షించుకొనుటకు వెరవుగానక దూరమున బెల్గాముమండలమున నున్నతనవృద్ధసేనాని యగుఅసాదుఖానుని దనకడకు రప్పించుకొని యికముందు చేయదగు కార్యమునుగూర్చి యతనితో నాలోచించెను. అనుభవజ్ఞుడగు నామహాసేనాని దీనికంతకు గారణభూతుడైన శత్రువు గోల్కొండసుల్తానుగాని తదితరులుగా రనియు, వీనిప్రేరేపణచేతనే తదితరులు శత్రుత్వమున వహించినవారుగా నుందురని యూహించి యతనితో సంధిచేసికొన్న దక్కినవారిని నేయుపాయముచేతనైన వశ్యపఱచుకొనవచ్చు నని చెప్పెను. ఈయుద్ధమునకు గారణములుగా నెన్నబడు సోలాపురమండలముతో జేరిన యైదుమండలములను బురహాన్‌నిజాముషాకు నిచ్చివేయుచు వెంటనే రామరాయలకు గొంతధనము నొసంగి వానితోగూడ సఖ్యము గావించుకొనవలసినదనియు, ఈయిర్వురు శత్రువులతాకిడి నుండి తప్పించుకొన్న యెడల దాను కుతుబ్షానెదుర్కొని విజాపురరాజ్యమునుండి యాత డాక్రమించుకొన్న దేశము నంతయు జయించి యిప్పించుటకు బాధ్యతను దాను వహింతు నని విన్నవించెను. విజాపురసుల్తాను వాని సలహాను మన్నించి యతడు చెప్పిన విధముగా బురహాన్‌నిజాముషా తోను రామరాయలతోను సంధి చేసికొనియెను. అసాదుఖాను తానుచేసిన వాగ్దత్తముప్రకారము గోల్కొండసుల్తానుపై దండెత్తిపోయి గోల్కొండదుర్గ ప్రాకారములకడ కుతుబ్షా సైన్యముల నోడించి విడిచి పెట్టెను. ఇట్లీయుద్ధము