పుట:Aliya Rama Rayalu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నొకజాబు వ్రాసెనట. ఆజాబులోనివిషయ మిట్లుండె నట! ఇబ్రహీమ్ ఆదిల్‌షా బుద్ధిపూర్వకముగా దండెత్తిరావలె నని వచ్చి యుండడు. అచటిజమీందారులెవ్వరో కుట్రచేసియతనిరప్పించి యుందురు. నీసైన్యములోనివారు కూడ వారిపక్షమున బనిచేయ వచ్చును. కావున నేదో సామోపాయముచేత ప్రస్తుతము సంధిచేసికొని భార్యను బిడ్డలను అసాదుఖానునుండి విడిపించు కొనవలయునని వ్రాసె నట.

ఇట్టిసలహా ననుసరించి వేంకటాద్రి అసాదుఖానునకు విశేషముగా లంచమునొసంగి వానిని మధ్యవర్తిగా జేసివాని ద్వారా విజాపురసుల్తానుతో మాట్లాడింపగా నాతడు సంధిచేసికొన ననుజ్ఞ నొసంగె నట! ఆసంధిషరతు లెట్టివో ఫెరిస్తా దెలుపలేదు గాని యుభయపక్షములకు సంతృప్తికరములుగా నున్న వట! ఇది ముగిసిన వెనుక అసాదుఖాను తనయజమానిని గలిసికొని విజాపురమునకును, వేంకటాద్రి తనకుటుంబమును దీసికొని విజయనగరమునకును వెడలిపోయి రట. ఈపయి చెప్పినది ఫెరిస్తావ్రాతవైఖరిని దెలుపుచున్నది. విజయనగర విప్లవమున ద్రోహియైన సలకముతిమ్మయకు దోడ్పడవచ్చి యీరీతిగా బరిభవమునొందినా డనిభావిప్రపంచము చేయు నిందనుండియు నపకీర్తినుండియు దప్పించుటకై మహమ్మదు ఖాశింఫెరిస్తా పైరీతిగా గల్పనముచేసి వ్రాసినవ్రాతగాని మఱియొండుగాదు. భీమరధివఱకు వేంకటాద్రిపోయి యుద్ధములు చేసి యున్నట్లుగా హిందువుల గ్రంథములు ఘోషించుచుం