పుట:Aliya Rama Rayalu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తుడై వేంకటాద్రి కాళ్లుపట్టుకొని సంధిచేసికొనవలసి వచ్చెను. అప్పుడు "సపాదక్షోణిభృత్ర్పాప్తి భాసురదుర్గాధిపతిత్వవైభవ" మనగా విజాపురరాజ్యములోని రాచూరు ముదిగల్లు మానువదుర్గముల నొసంగి సంధిచేసికొని తనరాజ్యము పరాదీనము గాకుండ గాపాడుకొన గలిగెను. వేంకటాద్రికిని నవాబరీదులకును జరిగినయుద్ధ మీవిధముగా ముగింపబడి యుండగా ఫెరిస్తా యీచరిత్రమునంతను దలక్రిందుగా మార్చి యెట్లు వ్రాసినాడో దానింగూడ దెలిసికొన్నయెడల చదువరులకిందలి సత్యము గ్రాహ్యముగాక మానదు. సలకముతిమ్మయను సింహాసన భ్రష్ఠునిగావించుటకై యళియరామరాయలు విద్యానగరమున మహావిప్లవమును గలిగించి సదాశివరాయని పట్టాభిషిక్తుని జేసినకాలము తనదండయాత్రకు మంచికాలము వచ్చె నని తలంచి యాదవానిదుర్గమును బట్టుకొనుటకై అసాదుఖానుని విజాపురసుల్తాను పంపించినా డనిఫెరిస్తా వ్రాసినదానిని నింతకు బూర్వముదెలిపి యున్నాను. అట్లు అసాదుఖాను ఆదవేనిదుర్గమును ముట్టడింప నావార్త విద్యానగరముననున్న యళియరామరాయలకు దెలియవచ్చి యాముట్టడిని విడిపించి యసాదుఖానుని జయించుటకై కొంతసైన్యముతో దనతమ్ముని వేంకటాద్రిని బంపె నట. అసాదుఖాను వేంకటాద్రి వచ్చుచున్నా డనివిని యాదవాని దుర్గమును ముట్టడించుట మాని వేంకటాద్రి నెదుర్కొనియె నట. అంతగొంచెము కాలము యుద్ధముజరిగినది గాని తనకునోటమి కలుగు నన్నభీతి