పుట:Aliya Rama Rayalu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజాపురసుల్తాను ఆదవాని దుర్గమును స్వాధీనము జేసికొని కొంతసైన్య మచటనిలిపి అసాదుఖాను సంరక్షణముననుంచెను. ఆదవాని సమీపించినతోడనే ఇబ్రహీమ్‌ఆదిల్‌షా, అమీర్‌బరీదుషా సైన్యములు వేంకటాద్రిసైన్యముల మరలయెదుర్కొని యుద్ధముసేయ సాహసించెను. విజయనగర సైన్యాధిపతియగు వేంకటాద్రి దమసైన్యములను దఱుముకొనివచ్చుచున్నా డనివిని అసాదుఖాను ఆదవానిదుర్గమును విడిచి కొంత యాశ్వికసైన్యమును మాత్రము దనతోనుంచుకొని తక్కిన సైన్యములను ఇబ్రహీమ్‌ఆదిలషా సైన్యములతో గలిసికొన నుత్తరువుచేసెను. తరువాతవేంకటాద్రిసైన్యము లాదవానిదుర్గము నాక్రమించుకొనిరి గాని అసాదుఖాను కానుపింపకపోయెను. అతడు ఆదిల్‌షాను గలిసికొనియుండు ననినిశ్చయించి విజాపురసైన్యములను దఱుముచునే యుండెను. ఒకనాటిరాత్రి ఆదిల్‌షాసైన్యము లొకచోట విశ్రమింప విడిచిన వనివిని తానును వానికి వెనుక నెనిమిదిమైళ్ల దూరములో విశ్రమించి వేంకటాద్రిసైన్యము లేమరియుండెను. వారితో గొనిపోయిన వస్తువాహన సామగ్రియు, స్త్రీజనబృందముతో వేంకటాద్రిమొదలగు సేనానుల కుటుంబములును డేరాలలో విశ్రమించి యున్నకాలమున పగలాసమీపమున నెచటనో దాగియున్న అసాదుఖాను మూడువేల గుఱ్ఱపుదళముతో వచ్చి పై బడియెను. వెనుకప్రక్కనున్న వేంకటాద్రిసైన్యము లావైపరీత్యమును గాంచి బెదరి చెల్లాచెదరై పోయెను. వాహన