పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

అక్కన్న మాదన్నల చరిత్ర

జనుల నాకర్షించెను. అతఁడే శివాజి! మూఁడువందలమైళ్లు నడచియున్నందునను అప్పుడే ఏదోజబ్బునుండి తేరుకొనుచున్నందునను చాల బలహీనుఁడుగా కనఁబడుచుండెను. కాని ఇటు నటువీక్షించుచుండిన యాతని నేత్రములలో తైక్ష్ణ్యమును కాంతియు జ్వలించుచుండినవి. పెదవులమీఁది యా ‘మీసాలలో నవ్వులు’ను చక్కఁగా కోటేరు తీర్చినట్లున్న యాతని నాసికయు నాతని కొక శోభనుకూర్చి ‘ఈతఁడు చండశాసనుఁడే గాని దయాళువే’ యని నాఁడు గోలకొండ చూపరులకు తోఁచు చుండెను. ‘శివాజీమహారాజ్‌కు జై’ అని ఆతనిచూచుచునే జనులు అఱచుచుండిరి. స్త్రీలందఱును మేడలనుండి పువ్వుల వర్షమును కుఱిపింపసాగిరి. ఇండ్ల వాకిండ్లలో ముత్తైదువలు హారతు లెత్తుచుండిరి. ఈవైభవమునంతయు చేయించుకొనుచు శివాజీ బదులు తాను బంగారమును వెండిని దారిపొడుగునను వర్షించుచుండెను. హారతులెత్తిన యిండ్లకడ తానే నిలిచి బ్రాహ్మణులచే ఆపళ్లెములలో వరహాలు పోయించుచుండెను. పట్టణములోని పేటల యధికారులు మర్యాద లొనర్చినప్పడు వారికి శివాజీ ఉడుగరలిచ్చి గౌరవించుచుండెను. 


ప్రకరణము ౯ - శివాజీ తానాషాను దర్శించుట

ఊరేగింపు దాద్‌మహల్‌కడకు వచ్చి నిలిచినది. ఎల్లవారును వారివారిస్థానములలో దిద్దితీర్చినట్లు నిలువఁబడిరి. శివాజీయును అతనియుద్యోగస్థులు ఐదుగురును అక్కన్నమాదన్న