పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

అక్కన్న మాదన్నల చరిత్ర

రుహుల్లాఖాౝ మొదలైనవారు తమకు దొరకినంత ధనము సేకరించుకొనిరి. బంగారము, నగలు, వెదకి స్వాధీనము చేసికొనసాగిరి. గోలకొండలోని ధనికులయొక్కయు సర్దారుల యొక్కయు వస్తువిశేషములను సోదావేయించుటకు మనుష్యుల నేర్పాటుచేసిరి. ఈదోపిడి యైన తర్వాత మొగలాయీసర్దారులు అపహరించినది పోఁగా పాదుషావారి ఖజానాకు చెల్లించినదిమాత్రము ఎంతవిలువ యనఁగా ఆఱుకోటుల ఎనుబదియైదు లక్షల హొన్నులు, రెండుకోటుల ఏబదిమూఁడువేల రూపాయలు, నూటపదునైదుకోటుల పదమూఁడులక్షల దమ్ములు. ఇవిగాక బంగారు వెండి పాత్రలు, నగిషీవస్తువులు ఎన్నియో! హైదరాబాదును పాదుషా దార్ – ఉల్ – జిహాద్ (మతమునకై పోరాడిన స్థలము) అని పేర్కొనెను. హైదరాబాదును పాలించుటకు ఏర్పాటులుచేసి 1689 సం॥ జనవరినెల పాదుషా గోలకొండను వదలి బీదరువైపు బయలుదేరెను. తానాషాను తనతోకూడ పాదుషా జాఫరాబాదు వఱకు కొనిపోయి అచటికి చేరఁగానే దౌలతాబాదు కోటకు పంపెను. ఆతనికి ఏకొఱఁతయులేక జరుపవలసినదని ఆజ్ఞాపించెను.

మొగలాయీరాయబారి సాదత్‌ఖాను తానాషా పంపిన నగలను పాదుషాకు చేర్పలేదు. తానాషాతో నాతఁడు చెప్పినదంతయు నబద్ధము. ఇప్పు డానగలను పాదుషాకిచ్చుటకు ధైర్యములేక పాదుషావారి ముసద్దీలను గ్రహింపుఁడని కోరెసు. వారు భయపడి మెల్లగా పాదుషాకు తెలిపి ఆతని