పుట:Adhunikarajyanga025633mbp.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రియొక్క మతాచారములపైనను అధికారముండదు. రాజ్యాంగమునకు అన్నిమతములును సమానమగు గౌరవార్హములే ! దేశశాంతికి, నైతికజీవనమునకు భంగకరమైనతప్ప, మతస్వాతంత్ర్యము సంకుచితపరుపరాదు. (17) పౌరులు తమకు అలవాటైన అనాదిసిద్ధమగు లేక యిష్టమగు భాషలనుపయోగించవచ్చును. మత, భాష, జాతి, ఆచారభేదముల పాటించక అందరిని సమానముగా రాజ్యాంగము ఆదరించవలయును. (18) బస్తీలయందు, 'చెకోస్లావిక్‌' భాషకాక, తదితరభాషలకు జెందినప్రజల విద్యాభివృద్ధినిమిత్తము ఆభాషలద్వారానే విద్యాప్రచుర మొనర్చుటకు విద్యాలయములను రాజ్యాంగమువారు స్థాపించవలెను.

ఈవిధముగా మూడుధర్మములు రాజ్యాంగవిధానపు చట్టములు నిర్వర్తించుట యుక్తము. వ్యక్తులువారిసంస్థల స్వాతంత్ర్యములు ప్రభుత్వముయొక్కయు పౌరులయొక్కయు బాధ్యతలు నిర్ణయించుచు రాజనీతిసూత్రముల రాజ్యాంగవిధానపు చట్టములందు జేర్చుట శ్రేయోదాయకమని రాజ్యాంగ వేత్తల యభిప్రాయమైయున్నది. మన కాంగ్రెసువారుకూడ మనప్రజల సాధారణహక్కుల నిర్వచించుటకు ప్రయత్నించుట కిదియే ముఖ్యకారణము. రౌండుటేబిలు కాన్పరెన్సునందుకూడ ఇట్టిపౌరసత్వపు హక్కు బాధ్యతలగూర్చి హెచ్చుగా శ్రద్ధచేయబడినది. ఈరాజ్యాంగవిధానపు చట్టములం