పుట:Adhunikarajyanga025633mbp.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బిడ్డల రక్షించవలెను. (4) బాలబాలికల నైతిక, ఆర్థిక, సాంఘికజీవితమునందు సురక్షితపరచవలెను. (5) విద్యాభివృద్ధి, కళలప్రాపకము కల్గించవలెను. (6) చారిత్రక సంబంధమగు, కట్టడముల, సృష్టివైచిత్ర్యముల గల్గినసంస్థల రక్షించవలెను. (7) దేశపుఆర్థికసంపద సాధ్యమైనంతవరకు ప్రజలందరియందు సమానముగా విభజింపబడునట్లు చేసి, వర్తక వాణిజ్యములు, సత్యమార్గములననుసరించి, కార్మికులక్షామమునకు భంగకరముకాకుండా, సంఘసామరస్యము కల్గునట్లు, రాజ్యాంగము శ్రద్ధచేయవలెను. (8) కార్మికులను రాజ్యాంగము, ప్రత్యేకముగా రక్షింపబూనుకొనవలెను. (9) స్వతంత్రభావ కల్పితమగు అన్ని విధములగు నూతన ఆలోచనలు, వస్తుజాలములు, యంత్రములును, రాజ్యాంగముయొక్క సాయము బొందు అర్హతకల్గియుండవలెను. (10) నానాజాతులకు సమానమగు శాసననిర్మాణమును, కార్మికులరక్షణకై చేయవలెను. ఈవిధముగనే, నూతనముగా స్థాపించబడిన, ఎస్థోనియా, బల్గేరియా, పోలాండు, ఆస్ట్రియా రాజ్యాంగముల యొక్క చట్టములందుకూడ రాజ్యాంగముయొక్క ధర్మములు పేర్కొనబడుచున్నవి.

వ్యక్తులకు, వారికి సంబంధించిన సంస్థలకు సాంఘికార్థిక, రాచకీయ, మత, స్వాతంత్ర్యములను రాజ్యాంగవిధానమున రక్షణ (Safe gaurds) గావించుటవసరము. ఈస్వా