పుట:Adhunikarajyanga025633mbp.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముల నెట్లుమోపబ్రయత్నింతురో, అటులనే, ప్రజాస్వామికమందును, అధికసంఖ్యాకుల నాయకులుకూడ తదితరులపై నిర్భంధములమోపి కష్టములదెచ్చిపెట్టుటకు సందేహించరు. నిరంకుశాధికారుల నరికట్టుట అంతకష్టసాధ్యమైన పనికాదు. కాని, ప్రజాస్వామికమందలి 'మెజారిటీ' యొక్క నిరంకుశత నాపుట దుస్తరమైన కష్టకార్యము. "తాము పల్కినదే బ్రహ్మవాక్కు, తాముచేసినదే దైవకార్యము" అను సంపూర్ణవిశ్వాసము, మెజారిటీవారికి కడుసులభముగా కల్గుచుండును. కనుక, అట్టి ఆత్మవిశ్వాసముచే తన్మయతబొందువారు, తదితరుల భేదాభిప్రాయములందు, భేదమగు ఆచారములందు అసహనముజూపుట సర్వసాధారణము. పొంగిపొరలివచ్చు మెజారిటీవారి ఆగ్రహము నాపుటకు, అనాలోచనము నరికట్టుటకు, విప్లవములైనను కార్యకారులు కాజాలవేమో? కనుకనే, అసాధారణము,అనుల్లంఘనీయమును, అఖండము నగు నీ 'మెజారిటీ' యొక్క నిరంకుశతనుండి, ప్రజాసామాన్యమును, వారిసంస్థలను, స్వాతంత్ర్యములను, సంరక్షించు టగత్యము. ఏది మెజారిటీకీ జపసత్వముల కల్గించుచున్నదో, ఎయ్యది ప్రజాస్వామ్యమును స్థాపించుచున్నదో, ఎద్దానివలన రాజ్యాంగసంస్థలు తమస్థానమును బొందుచున్నవో, అట్టి రాజ్యాంగ విధానపుచట్టమునందే వివిధప్రజాసమూహములకు, వివిధప్రజాసంఘములకు, వివిధవ్యక్తులకు, నైతిక,