పుట:Adhunikarajyanga025633mbp.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము.

వస్తు నిర్మాతల శాసనసభ.

సాంఘికవాదులు, సమిష్టివాదులును, ఈకాలపు శాసనసభలన్న చాలయసంతృప్తి పొందియున్నారు. ఏదేశమందును పదికాలములపాటు కార్మికుల మంత్రివర్గముల పెత్తనము వచ్చి, ప్రజాసామాన్యమునకు వలయు సౌకర్యములు కల్గించుట, ఇప్పటి శాసనసభాప్రవృత్తి సాధ్యపరచుట లేదని వారికి కష్టముగానున్నది. కార్మికులు ప్రతిదేశమందును అధికసంఖ్యాకులై యుండినను, వోటర్లందును కార్మికులే మెజారిటీయందున్నను, కార్మికుల మంత్రివర్గముల నేర్పరచు యోగ్యత ఏదేశమందును సాధారణముగా కలుగకుండుట అన్యాయమే! ప్రజాజీవితమందు తినుటకు తిండి, త్రాగుటకు నీరు, పరుండుట కిల్లు, సంపాదించుకొనుటకే హెచ్చుకాలము పట్టుచున్నది. ఆకాలమందు వారు ఏయే కర్మాగారములందు, వర్తక వాణిజ్యములందు కృషిచేయుచున్నారో ఆ వ్యవహారములతో నంతగా జోక్యము కల్గించుకొనని యీకాలపు శాసనసభలతో ప్రజ లసంతృప్తిబొందుచున్నారు. వారికి ఏవ్యవహారములు సక్రమముగా జరిగిన తమ జీవితము సలక్షణమగునో అట్టి ఆర్థికజీవితముతో ప్రత్యేక