పుట:Adhunikarajyanga025633mbp.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యందు ప్రచురము కల్గించవలెను. కాని తాను జాతీయప్రతినిధిననియు, ప్రజలెల్లరి పెత్తందారుననియు, దేశీయుల యభిప్రాయముల వెల్లడిచేయవలసినభారము తనపై కలదనియు ఆతడు గ్రహించవలెను. నియోజకవర్గముపై తాను తన సభ్యత్వమునకు ఆధారపడియున్నను దేశమునకంతకు సేవచేయుటే తన పరమావధియని నమ్మవలెను. తనవలెనే అందరును తమతమ నియోజకవర్గముల ప్రత్యేకలాభములకై కృషిచేయబూనుకొనుచో దేశీయుల అవసరముల దీర్చువా రెవ్వరుండరని ఆతడు తెలుసుకొనవలెను.

ఏసభ్యుడును తాను తన నియోజకవర్గమునకు గాని అందలి తనపక్షపు నాయకులకుగాని ఏజెంటునని భావించరాదు. ఆతని ఎన్నుకొనుటె ప్రజలధర్మము. ఆయనరాచకీయాభిప్రాయములు, ఆశయములు, అనుభవములు నడతలగూర్చి తెలుసుకొని తమకుగాను కాలక్రమేణ బయలుదేరు రాజ్యాంగ వ్యవహారములందు తగుపెత్తనము జేయుటకై ప్రజలు వాని నెన్నుకొనవలెను. ఆసభ్యుడు రెండు మూడు నాల్గు లేక ఐదువత్సరముల కొకమా రెన్నుకొనబడును, కనుక ఎన్నికలు జరుగుసమయమందే వోటరులు తమకప్పుడుండు యభిప్రాయములప్రకారము తనసభ్యత్వ కాలమందంతట నడచు కొనుమని కోరుట అసంగతము. అప్పటి కప్పుడు కల్గుచుండు వ్యవహారములపై తమప్రతినిధి ఎట్లు ప్రవర్తించ