పుట:Adhunikarajyanga025633mbp.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ములనిర్మించు యవకాశము సన్నగిల్లుచున్నది. బడ్జెట్టుపై నాతనికుండు పెత్తనము చాల తక్కువగాయున్న్నది. ప్రభుత్వపుచర్యల విమర్శించుటకైనను శాసనసభలకు తగువ్యవధి లేకుండుటచే ప్రతిసభ్యునకు తగినంతయవకాశము కల్గుట లేదు. ప్రభుత్వపుబిల్లులను చర్చించుటకుగూడ శాసనసభాసభ్యునకు తగినంతసావకాశము చిక్కుట లేదు. రాచకీయపార్టీలు శాసనసభలందు స్థిరపడి యుండుటచే వివిధబిల్లులను, బడ్జెట్టును, తీర్మానములను, అడ్జెరన్‌మెంటు తీర్మానముల చర్చించుటకుగాను సాధ్యపడు అవకాశములను సంపూర్ణమగు యుపయోగమునకు పెట్టుటకై పార్టీ నాయకులు తమ యనుచరులలో ఏకొందరినో నియమించుచుందురు. కాన, హెచ్చుమంది సభ్యులకు అరుదుగామాత్రమే ఉపన్యసించుటకు అవకాశము కల్గుచుండును. ఇట్టిపరిస్థితులందు, శాసనసభాసభ్యులు తమ సభాకార్యక్రమమందు అశ్రద్ధబూని తమస్వలాభమును, తమనియోజజవర్గపు లాభమును , తమపక్షముల శ్రేయమునేకోరుచు, తమధర్మమును నిర్వర్తింపలేకున్నారు. ఈదుస్థితిపోగొట్టుటకై ప్రతిసభ్యునకు ప్రభుత్వ వ్యవహారముల గురించి తగినంత అనుభవజ్ఞానము కల్గుటకై ప్రభుత్వ చర్యలను ఎప్పటికప్పుడు విమర్శించి వ్యవహారము చెడుమార్గముల బట్టకముందే మంత్రివర్గమునకు జాగ్రత్తగొల్పుచుండుటకు దగు అవకాశములను స్థాయిసంఘములస్థాపిం