పుట:Adhunikarajyanga025633mbp.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము.

శాసనసభ్యుడు.

ఈకాలమున ప్రాముఖ్యతవహించిన ప్రజాస్వామిక రాజ్యాంగములందు, రెండు శాసనసభలు కలవు. కాని వానిలో

ప్రజలు
పార్టీలు.

ప్రజాప్రతినిధిసభలకే, మంత్రివర్గముల నేర్పరచుటలోను, శాసననిర్మాణ మొనర్చుటలోను, బడ్జెట్టుల నామోదించుటలోను, ప్రాధాన్యత సంపాదితమగుచున్నది. కాని రెండుశాసనసభాసభ్యులకును, కొంతవరకు సమానమగు హక్కు బాధ్యతలు కలవు. ముందుగా వానిని విచారించి - పిమ్మట, ప్రముఖుడగు ప్రజాప్రతినిధిసభాసభ్యుని హక్కుబాధ్యతల ప్రత్యేకముగా వివరింప బ్రయత్నింతము.

శాసనసభాసభ్యు లెల్లరకు, తమతమ సభలందు, ప్రజాభిప్రాయమును వెలిపుచ్చుటకును, తమయభిప్రాయములనే తెల్పుటకును, ప్రభుత్వవ్యవహారముల తమకు తోచినరీతి విమర్శించుటకును, సంపూర్ణమగు హక్కుయుండు టగత్యము. మాననష్టమునకై, ఏప్రభుత్వోద్యోగియైన వ్యాజ్యము తెచ్చునేమోయను భయముండుచో, ఏశాసనసభాసభ్యుడైనను, ప్రభుత్వపుచర్యలను నిర్భీతమై విమర్శింపజాలడు. ప్రభుత్వవ్యవహారముల తీవ్రముగా విమర్శించినందులకై