పుట:Adhunikarajyanga025633mbp.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చర్యలలో పాల్గొనవచ్చును. అమెరికాయందు తప్ప మిగత దేశములందలి సెనెటుసభ్యులలో కొందరు మంత్రివర్గమందు జేర్చుకొనబడుచున్నారు. సెనెటుసభయే యుండుట తటస్థించినచో అందు అనుభవజ్ఞులు రాచకీయవిజ్ఞాను లనేకులుండుట సాధ్యము. కనుక వారిలో కొందరు మంత్రివర్గమందు జేర్చుకొనబడుట ప్రజాక్షేమకరమగును. మరియు ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఆదిగాగల దేశములందు శాసననిర్మాణమునందు సెనెటుసభకు చాల యధికార మివ్వబడుచున్నది. గనుక మంత్రివర్గముతో నాసభవారు సాధ్యమైనంతవరకు సహకార మొనర్చునట్లు ప్రోద్బలపరుపకల్గు సభ్యులుకొందరు మంత్రివర్గమునందు జేర్చబడుట లాభకరము.

ప్రభుత్వపు కార్యనిర్వాహకభారము హెచ్చగుచున్న కొలది వర్తక వాణిజ్యములు బీదసాదల రక్షణ ప్రయత్నములకు సంబంధించిన శాసనముల ననేకము ప్రతివత్సరము శాసనసభలు నిర్మించవలసి వచ్చుచున్నది. ఆ శాసనములందే ప్రతివిషయము గురించియు వివరముల తెల్పుచు ప్రతినియమమునకు సంబంధించిన హంశముల వివరించుటకు శాసనసభలకు వ్యవధియుండదు. పైగా కాలానుగుణముగా పరిస్థితుల ననుసరించి అనేక క్రొత్తనియమము లగత్య మగుచుండును కాన వాని నిర్మించుటకు శాసనసభవారే పూనుకొనుటకు బదులు అట్టిశాసనముల నమలులో పెట్టవలసిన మం