పుట:Adhunikarajyanga025633mbp.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభవారికుండరాదను సదభిప్రాయము ప్రపంచమందంతట అంగీకరింపబడుచున్నది. ఇక, ప్రభుత్వాదాయమును హెచ్చుగా బీదవారిపై ఖర్చిడుట న్యాయమా? ఆవిషయములైనను తీర్మానించు నధికారము సెనేటుసభవారి కుండుట న్యాయము కాదాయని లార్డుహ్యూసెసిలువగైరాలు వాదించుచున్నారు. కాని, ఈ కాలపు సాంఘికార్థికపుటేర్పాటులవలన హెచ్చులాభము అన్నిదేశములందును ధనికులే బొందుచున్నారు. కొలదిమందిధనికులు, అధిక సంఖ్యాకులు బీదలు, ఐయుండుటచే సంఘ దుర న్యాయములెన్నో కల్గుచున్నవనియు, ప్రజాసామాన్యము కుడువ తిండి, కట్ట బట్ట, పండ నిల్లు లేక అలమట జెందుటచే సంఘారోగ్యము క్షీణించుచున్నదనియు, సాధ్యమగునంతవరకు శాంతియుతమగు మార్గములద్వారా దేశపు సంవత్సరాదాయము హెచ్చుగా బీదసాదల క్షేమాభివృద్ధినిమిత్తమై ఖర్చిడుట దేశీయు లెల్లరికి, మానవకోటికంతకు శ్రేయమని ఎల్లరొప్పుకొనుచున్నారు. అట్టియెడ ప్రభుత్వాదాయము ప్రజల మేలునకై ఎటుల ఖర్చిడవలెనో తీర్మానించుటకు ప్రజాప్రతినిధిసభవారికేగదా అధికారముండవలయును? అల్పసంఖ్యాకుల "సెనేటుసభ"కే యధికారమిచ్చుట న్యాయమా?

ప్రభుత్వనిర్వహణ మెట్లు జరుపబడుచున్నదో విచారించుటకు, ప్రభుత్వ వ్యవహారములగురించి తగు ప్రశ్నలనడిగి మంత్రివర్గమువారినుండి సమాధానముల గైకొని అందలి