పుట:Adhunikarajyanga025633mbp.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సెనెటుసభవారి కేమాత్రము శక్తిజాలకున్నది. ఇట్టిసభవలన యిక లాభమేమికలదు? తుదకీసభకు ప్రజాప్రతినిధిసభ యొక్క స్థాయిసంఘమునకుండు స్వాతంత్రమైనలేదుగదా?

ఫ్రెంచిరాజ్యాంగమునందలి సెనెటుసభ, కెనడా రాజ్యాంగపు సెనెటుకంటె, బాధ్యతకల్గియున్నది. జర్మనుదేశపు రైష్‌రాత్ వలె, రాష్ట్రీయప్రభుత్వములచే నియమింపబడిన సభ్యులచేకాక, ప్రజలందు కొందరిచే ఎన్నుకొనబడిన సెనెటురులచే,

ఫ్రాన్సు.

ఫ్రెంచిసెనెటు అలంకరింపబడుచున్నది. ప్రజాప్రతినిధిసభ్యులును, జిల్లా, తాలూకాబోర్డుల సభ్యులును, మ్యునిసిపాలిటీలు (కమ్యూనులు) తరుచుగా ఎన్నుకొనిన డెలిగేటులును, సెనెటరుల నెన్నుకొనుట కధికారముబొందియున్నారు. ప్రతిజిల్లాయు ఒక్కనియోజకవర్గముగా నేర్పరపబడినది. అందలి వోటరులెల్లరు ఎన్నికలందు పాల్గొని, సెనెటరుల నెన్నుకొందురు. ఈవిధముగా ప్రజాప్రతినిధులచే సెనెటరులెన్నుకొనబడుచున్నారు గనుక కొంతవరకైనను, ప్రజాభిప్రాయమును తెలుసుకొనుటకు ప్రజలఆలోచనల గ్రహించుటకు సెనెటరులకు సాధ్యమగుచున్నది. ప్రతిసెనెటరును తొమ్మిదివత్సరముల వరకు సభ్యత్వము బొందియుండును. ప్రజాప్రతినిధిసభాసభ్యులు నాల్గువత్సరముల వరకె సభ్యత్వముబొందును. కాన సెనెటరునకు హెచ్చు శాసనసభాసభ్యత్వానుభవము కల్గుటకు సాధ్యముకాగలదు.