పుట:Adhunikarajyanga025633mbp.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వామిక పాలనము జయప్రదము కాజాలదనియు, నిరంకుశ పాలనమే, ఆధునిక కాలమందు ప్రజలకు శరణ్యమనియు వాదించ ప్రారంభించుచున్నారు. ప్రజాస్వామికము బొందిన దేశములు తిరిగి నిరంకుశపాలనమునకు లోబడుటయే, ప్రజాస్వామిక రాజ్యాంగము జయప్రదము కాజాలదని నిరూపించు చున్నదనియు అట్టిదేశములందు నిరంకుశపాలన మేర్పడుట వలన శాంతిస్థాపనయై, ఆర్థికాభివృద్ధికలిగి సాంఘిక సౌష్టత యేర్పడుచున్నదనియు, వారు వాదించుచున్నారు.

కాని అచ్చటచ్చట నపజయ మందినంతమాత్రమున ప్రజాస్వామిక రాజ్యమును నిరాకరింపదగునా? ప్రజాస్వామికమగు దేశములందుకంటె తదితరప్రభుత్వ విధానముల బొందిన దేశములందు హెచ్చు శాంతి, భద్రత, అభివృద్ధి, ప్రజాక్షేమము కల్గుచున్నదని చెప్పగలమా? అచ్చటచ్చట, అప్పుడప్పుడు, అదృష్టవశాత్తు, అప్రతిమాన ప్రతిభావంతుడగు నిరంకుశాధికారి పెత్తనమున కొంతలాభము కల్గిన కలుగవచ్చును. కాని అట్టి అసమానప్రజ్ఞావంతులు, ఎల్లప్పుడు రాజ్యాధికారము వహింప లభ్యపడుదురని ఏరు చెప్పగలరు? ఇటలీదేశమును క్రిందటి పదివత్సరములనుండి నిరంకుశముగా పాలించుచున్న శ్రీముస్సోలినీగారు తనపిమ్మట నెవరా? యని సంశయాకులితచిత్తుడై మ్రగ్గుచున్నాడు! నాల్గువత్సరములపాటు నిరంకుశముగా, స్పెయినుదేశమును పాలించిన